మక్తల్ టౌన్, మే 5 : నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ సీతయ్య అన్నారు. పట్టణంలోని ఫర్టిలైజర్ షాపులు, విత్తనాలు అమ్మే దుకాణాలను గురువారం సీఐ సీతయ్య వ్యవసాయ శాఖ మండల అధికారి మిథున్ చక్రవర్తితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నకి లీ విత్తనాలు, ఎరువులు అమ్మరాదని, ఎవరైనా అమ్మితే క ఠిన చర్యలు తప్పవని సూచించారు. రైతులకు విక్రయించి న విత్తనాలు, ఎరువులకు సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై రాములు, ఏ ఈవో శివ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాసిరకం విక్రయిస్తే కఠిన చర్యలు
రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అశోక్ బాబు అన్నా రు. మండలకేంద్రంలోని ఫర్టిలైజర్స్ షాపులను గురువారం వ్యవసాయ శాఖ మండల అధికారి శివకుమార్‌తో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే చట్టపరంగా కేసులు న మోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అ ధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
దుకాణాలు తనిఖీ
విత్తన దుకాణాలను వ్యవసాయ శాఖ మండల అధికారి హరిత, ఎస్సై నరేందర్ తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నకిలీ విత్తనాలు విక్రస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పే ర్కొన్నారు. రైతులకు అన్ని విధాలుగా సహకరించడంతో పాటు రికార్డులు నిర్వహణ చేయాలన్నారు. మండలంలోని పలు విత్తన దుకాణాలను తనిఖీలు చేశామన్నారు.
తనిఖీలు చేసిన అధికారులు
మండల వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారి శ్యామిల్జాన్, ఎస్సై జగదీశ్వర్ పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలు, గోదాములను గురువారం తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులను ఎవరైనా అ మ్మితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు వి త్తనాలపై అనుమానం వస్తే వెంటనే అధికారులను సంప్రదించాలన్నారు.