కల్వకుర్తి, మే 5: అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న రాష్ట్ర ప్రగతి చూడలేక కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తుందని ఎంపీ రాములు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల అనుసారం కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కల్వకుర్తి మండలం ఎల్లికల్, రఘుపతిపేట, మార్చాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి ఎంపీ రాములు ప్రారంభించారు. కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగిలో సాగు చేసిన వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం సాకులు చెబుతుందని మండిపడ్డారు. కేంద్రం రైతులను ఇబ్బందుల పాలు చేసినా రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యాన్ని కొనుగోలుకు శ్రీకారం చుట్టారన్నారు. రైతుల నష్టపోకూడదే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని భరిస్తూ వడ్లు కొనుగోలు చేస్తుందని వివరించారు. దేశంలో యాసంగిలో అత్యధికంగా ధాన్యాన్ని పండిస్తున్న రాష్ట్రం తెలంగాణే అని గుర్తుచేశారు. వడ్లు కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, వైస్ చైర్మన్ శ్యాంసుందర్, ఎంపీపీ మనోహర, సర్పంచ్ బాలస్వామి, జంగయ్య, ఎంపీటీసీ సునీత, సంతోష, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు విజయ్‌గౌడ్, కుర్మయ్య, సూర్యప్రకాశ్‌రావు, మనోహర్‌రెడ్డి, మదన్, శ్రీనివాస్, మోహన్, నరేశ్, యాసుఫ్, చెన్నకేశవులు పాల్గొన్నారు.