మహబూబ్‌నగర్‌టౌన్, మే 4 : కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్స్ అన్నిరంగాలతోపాటు విద్యారంగాన్ని కుదిపేసింది. విద్యార్థులను ప్రత్యక్ష తరగతులకు దూరం చేసింది. పరీక్షల నిర్వహణకు వీలులేని పరిస్థితులను సృష్టించింది. కరోనా వ్యాప్తి తగ్గుమొఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఇంట ర్ పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈనెల 6నుంచి 19వ తేదీవరకు ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు వడదెబ్బ బారినపడకుండా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందుకు ఆర్టీసీ, విద్యుత్, వైద్యం, పోలీసు, రెవె న్యూ, పోస్టల్, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో ముం దుకు సాగుతున్నారు. విద్యార్థులకు బస్సులు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పరీక్ష సమయంలో విద్యుత్ స రఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. తాసిల్దార్లు, పోలీసు అధికారులు పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాల మూసివేత, బందోబస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు.
21,674మంది విద్యార్థులు..
ఇంటర్ మొదటి సంవత్సరంలో 11,025మంది, రెండో సంవత్సరంలో 10,649 మందితో కలిపి మొత్తం 21,674మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నా రు. జిల్లావ్యాప్తంగా 32 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 32మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 32మంది డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. ఒకేషనల్ కళాశాల మినహా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కావొద్దన్న నిబంధనను పక్కాగా అమలు చేయనున్నారు. గంటముందే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మాస్‌కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటు న్నాం. విద్యార్థులు ఒక్క నిమి షం ఆలస్యంగా వచ్చినా పరీక్షాకేంద్రంలోకి అనుమతించం, పరీక్ష సమయానికి గంటముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
– వెంకటేశ్వర్లు, డీఐఈవో, మహబూబ్‌నగర్