మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మే 4 : ప్రభుత్వ ఉద్యోగ సాధనకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సమయం వృథా చేయకుండా కష్టపడి చదవాలని ఎక్సైజ్, క్రీడాశా ఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల సాధనకు సిద్ధమవుతున్న యువతకు శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏ జిల్లాకు ఆ జిల్లా పోస్టులను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు.
జోనల్ వ్యవస్థను అమలు చేసి స్థానికులకే ఉద్యోగాలు వచ్చే లా సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. యువ త ఉద్యోగాలు సాధించేందుకు ఇది మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో నిష్ణాతులతో మెటీరియల్‌ను తయారు చేయించడంతోపాటు నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే ఆన్లైన్లో కూడా శిక్షణ ఇస్తామన్నారు. మహిళా ఆభ్యర్థులకు ఎదిర సమీపంలోని గిరిజన వర్కిం గ్ ఉమెన్స్ హాస్టల్ లేదా మరోచోట వసతి కల్పిస్తామని తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించేందుకు 5నెలలు కష్డపడి చదవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు ఉద్యోగాలు అవసరమని, చదువుపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. అన్ని ఉద్యోగాలకన్నా పోలీసు ఉద్యోగం గొప్పదని, నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. ప్రజల్లో ధైర్యం, భరోసానింపడం పోలీసు ఉద్యోగంతోనే సాధ్యమన్నారు. ఏ ఉద్యో గం వచ్చినా నిజాయితీగా సేవలు అందించాలని సూచించారు.
ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు శిక్షణ ఇవ్వడానికి మూడు నెలల నుంచి ప్రణాళికలను రూపొందించినట్లు తె లిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచనమేరకు పటిష్టమైన మెటీరియల్‌ను రూపొందించామని, మంచి అధ్యాపకులను ఏర్పా టు చేశామన్నారు. శిక్షణ పొందే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అనంతరం శాంతానారాయణగౌడ్ చారిట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రూపొందించిన మెటీరియల్‌ను మంత్రి పంపిణీ చే శారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ గోపాల్‌యాదవ్, ఏఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ గణేశ్, డీఎస్పీ మహేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, కౌన్సిలర్లు గోవింద్, కోట్ల నర్సింహులు, జాజిమొగ్గ నర్సింహులు పాల్గొన్నారు.