మహబూబ్‌నగర్, మే 4 : ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మతకల్లోహాలు సృష్టించడం.. హిందూ, ము స్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధిపొందడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారిందని క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. అభివృద్ధి పదానికి అ ర్థం తెలియని కమలం పార్టీ నాయకులు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మేమున్నాం.. అంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బుధవా రం మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఓబ్లాయిపల్లి, ఓబ్లాయిపల్లి తండా, కోడూరు, ధర్మాపూర్, జిల్లా కేంద్రంలోని వీరన్నపేటకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నే తలు 500 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేస్తారో చెప్పకుండా కాలయాపన చేస్తున్నారని బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. అందరం కలిసి ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేద్దామన్నారు.
ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దామన్నారు. మనం కడుతున్న పన్నుల కంటే మనకు తక్కవ శాతమే కేంద్రం నిధులను ఇస్తుందని తెలిపారు. నా ఓటు హక్కును సైతం ఫోర్జరీ సంతకంతో తొలగించారని విమర్శించారు. ప్రజలకు మంచి చేయాలనే తపన గుండెల్లోంచి రావాలని సూచించారు. పాలమూరు ప్రజలకు ఎవరికీ ఎలాంటి హాని కలుగకుండా నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. ప్రజల సంక్షేమమే నా ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ముడా చైర్మన్ వెంకన్న, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, ఏఎంసీ చైర్మన్ రహెమాన్, కౌన్సిలర్లు నర్సింహ, కిశోర్, మోతిలాల్, యాదగిరిగౌడ్, అనంతరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాడం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.