రాజాపూర్, మే 2 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనావిధానంతో రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తున్నదని జడ్చ ర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని తిర్మలాపూర్‌లో సోమవారం రైతువేదికను ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీరోడ్డు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు శిథిలావస్థకు చేరిన ఇండ్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలతో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. త్వరలోనే సొంత స్థలం ఉన్నవారు ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. అలాగే అర్హులందరికీ దళితబంధు సాయం అందిస్తామని తెలిపారు. జాతీయ పార్టీలు రాష్ర్టానికి చేసిందేమీలేదన్నారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. అదేవిధంగా దోండ్లపల్లికి చెందిన శ్రీకాంత్‌కు రూ.3.50లక్షలు, కుత్నేపల్లికి చెందిన లాలీకి రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
కుచ్చర్కల్కు చెందిన యువతి పెండ్లికి రూ.20వేల ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్ చైర్మెన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ యా దయ్య, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, సర్పంచ్ మహేశ్వరి, ఎంపీడీవో లక్ష్మీదేవి, యూత్వింగ్ మం డల అధ్యక్షుడు వెంకటేశ్,నాయకులు మహిపాల్‌రెడ్డి, పుల్లారెడ్డి, సంతోష్‌కుమార్, రామకృష్ణాగౌడ్, మల్లయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, యాదగిరి, చంద్రయ్య, నర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌నాయక్, రమేశ్‌నాయక్ పాల్గొన్నారు.
‘దళితబంధు’ దేశానికే ఆదర్శం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని వాడ్యాల్లో పల్లెప్రకృతి వనం, వైకుంఠధామంతోపాటు రూ.5లక్షలతో నిర్మించిన ఈద్గాను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. మనఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.40లక్షలతో పాఠశాల నూతన భవనం నిర్మిస్తామని తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రెండునెలల్లో డబుల్బెడ్రూం ఇండ్ల పనులను పూర్తిచేసి పేదలకు అందిస్తామని తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో వేసవిలోనూ ప్రతి ఇంటికీ తాగునీరు అందుతున్నదని తెలిపారు. దళితబంధు పథకంతో అర్హులందరికీ రూ.10 లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు చెప్పారు. దళితు లు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంతమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, స ర్పంచ్ మంగమ్మ, ఎంపీటీసీ సుదర్శన్, జంగిరెడ్డి, నా రాయణరెడ్డి, సుధాబాల్రెడ్డి, బాలు, శ్రీనివాసులు, జైపాల్‌రెడ్డి, ఎ ల్లయ్యయాదవ్, నర్సింహ, వెంకటయ్య, సుకుమార్, శేఖర్, భీంరాజు, బంగారు, నవీన్ ఆచారి, శంకర్ పాల్గొన్నారు.