భూత్పూర్, మే 2 : యువత టీఆర్ఎస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీలోని 4వ వార్డుకు చెం దిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50మంది యువకులు సోమవారం అన్నాసాగర్‌లో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో యువకులే ప్రధానపాత్ర పోషించారన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నోటిఫికేషన్లు జారీ చేస్తున్నదని తెలిపారు. అలాగే ఆయా కార్పొరేషన్ల నుంచి సబ్సిడీపై రుణాలను అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత టీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. టీఆర్ఎస్లో చేరినవారిలో పరశురాం, గడ్డం మహేందర్, చంద్రశేఖర్, అనిల్, రఫీక్, రాజేశ్, ముని, వెంకటేశ్, శ్రీకాం త్, శ్యామ్, కల్యాణ్, గాంధీ, శివ, శ్రీకాంత్, ఖయ్యూం తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, అశోక్‌గౌడ్, గడ్డం రాములు, బోరింగ్ నర్సింహులు, నర్సింహులు, వెంకటయ్య పాల్గొన్నారు.