మహబూబ్‌నగర్ మే 2 : ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి క్యాంపు కా ర్యాలయంలో మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి సత్యం యాదవ్, కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు పెద్దరాములతోపాటు 300మంది బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలుకప్పి ఆహ్వానించా రు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ను అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని అన్నా రు. టీఆర్ఎస్ ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో మహబూబ్‌నగర్‌ను అంచెలంచెలుగా హైదరాబాద్‌కు సమాంతరంగా అభివృద్ధి చేసుకుందామని సూచించారు. పార్టీలో చేరిన వారిలో యాదవ సంఘం ముఖ్యనాయకులు శ్రీనివాస్‌యాదవ్, రాఘవేందర్‌యాదవ్, శ్రీనివాస్‌యాదవ్, రవికుమార్‌యాదవ్, సాయితేజయాదవ్, అఖిలేశ్‌యాదవ్, పవన్‌కుమార్‌యాదవ్, కిరణ్‌కుమార్‌యాదవ్, విగ్నేశ్యాదవ్, సా యికిరణ్యాదవ్, అభిషేక్‌యాదవ్ తదితరులు ఉన్నా రు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, జిల్లా రైతుబంధు సమి తి అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, గొర్రెల పెంపకందార్ల సంఘం అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, రైతుబంధు సహకార సంఘం సభ్యులు మలు ్లనర్సింహారెడ్డి, కౌన్సిలర్ యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గువ్వల సమక్షంలో చేరికలు
మండలంలోని మన్ననూర్ గ్రా మానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మన్ననూర్ సర్పంచ్ శ్రీరామ్‌నాయక్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు. పార్టీలో చేరిన వారిలో ఇస్లావత్ లక్ష్యానాయక్, రాముడు, గోపాల్, గణేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు చెన్నకేశవులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.