నారాయణపేట టౌన్, మే 1 : జిల్లాకు సరిహద్దున ఉన్న ఆరు చెక్‌పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి కర్ణాటక రాష్ట్రం నుంచి జిల్లాలోకి ధాన్యం రాకుండా చూడాలని అదనపు కలెక్టర్ పద్మజారాణి అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్, సివిల్ సరఫరా, పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఆదివారం ఆమె ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. కర్ణాటక నుంచి ధాన్యం రాకుండా తీ సుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాహన వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కూడా చెక్‌పోస్టులు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందు కు పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు టాస్క్‌ఫోర్స్ ఏ ర్పాటు చేయాలన్నారు. జిల్లా పౌర సరఫరా ల శాఖ అధికారి శివప్రసాద్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్‌సుధాకర్, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.
బయటి ధాన్యం రాకుండా చూడాలి
దామరగిద్ద, మే 1 : పక్క రాష్ర్టాల నుంచి ధాన్యాన్ని అమ్మకానికి తీసుకురావొద్దని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. మండ లంలోని కానుకుర్తి చెక్‌పోస్టును ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న అవకాశాన్ని మ న రైతులే సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కా ర్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అరవింద్, వీఆర్ఏ మురుగయ్య, కానిస్టేబుల్ రవీందర్ పాల్గొన్నారు.
ఉజ్జెల్లి చెక్‌పోస్టు పరిశీలన
మాగనూర్, మే 1 : మండలంలోని ఉజ్జెల్లి చెక్‌పోస్టును ఆదివారం అదనపు కలెక్టర్ పద్మజారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల నుంచి రూ.1960 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వడ్లు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏవో హరిత, చెక్‌పోస్ట్ ఇన్చార్జి నర్సింహ, వీఆర్ఏ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలి
కృష్ణ, మే 1 : మండలంలోని గుడెబల్లూర్ గ్రామం వా సునగర్ అంతర్ రాష్ట్ర రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆదివారం అదనపు కలెక్టర్ పద్మజారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ జిల్లా నుంచి వడ్లు కొనుగోలు చేసి అక్రమంగా తెలంగాణలోకి వచ్చే వారిపై ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసి పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొ న్నారు. కర్ణాటక నుంచి వడ్లు తీసుకు వచ్చే వారిపై పీడీ యా క్ట్ కింద కేసు నమోదు చేయాలన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతానికి అధికసంఖ్యలో నిత్యం వం దలాది వాహనాలు వస్తున్న నేపథ్యంలో ముమ్మరంగా తని ఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్ సుధాకర్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి శివప్రసాద్, ఏవో సుదర్శన్‌గౌడ్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.