జడ్చర్లటౌన్, మే 1 : మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య అన్నారు. జడ్చర్ల మం డలం కోడుగల్లో ఆదివారం ముస్లింలకు రంజాన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్‌చైర్మన్ మాట్లాడుతూ తె లంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం ము స్లింలకు అండగా నిలిచి అనేక పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. షాదీముబారక్, సబ్సిడీ రుణాలు, ఇమామ్‌లకు గౌరవ వేతనం, మైనార్టీ గురుకులాల ఏర్పాటు తదితర కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు, సింగిల్‌విండో డైరెక్టర్ రామకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులుగౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఇంతియాజ్‌ఖాన్, నవీన్‌రెడ్డి, రామచంద్రయ్య, వెంకటయ్య, సురేందర్‌రెడ్డి, నాగిరెడ్డి, రమే శ్, సుధాకర్‌రెడ్డి, అంజిరెడ్డి, రాజు, మసీదు కమిటీ సభ్యులు నయీం, మజీద్, మహ్మద్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
మండలంలోని ఉదండాపూర్ మసీదు లో మాజీ సర్పంచ్ లక్ష్మమ్మ సౌజన్యంతో ఇ ఫ్తార్విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు హబీబ్, రామాంజనేయులు, అబ్దుల్హకీం, అబ్దుల్ రవూఫ్, షపీఉల్లా, వార్డుసభ్యుడు అబ్దుల్‌పాషా, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య పాల్గొన్నారు.
అన్నివర్గాలకు సమప్రాధాన్యం
దేవరకద్ర రూరల్, మే 1 : ప్రభుత్వం అన్నివర్గాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని ఎంపీపీ రమాదేవి అన్నారు. మండలంలోని నాగారంలో ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సం దర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పేదలు సం తోషంగా పండుగలను జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దుస్తులను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో గ్రా మ పెద్దలు పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, మే 1 : మండలంలోని కాకర్లపహాడ్‌లో సర్పంచ్ పాశం జంగమ్మ, ఉపసర్పంచ్ పెంటయ్య ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైస మ్మ ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్, నర్సింహులు, సుభాన్ ఆచారి, సంజీవరెడ్డి, బాలయ్య, మాసయ్య పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, మే 1 : మండలంలోని జూలపల్లి, దేశాయిపల్లి, మహ్మదాబాద్ గ్రామాల్లో పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో సర్పంచులు జితేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, మే 1 : మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య తెలిపారు. మండలకేంద్రంలోని పెద్ద మసీదులో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్‌విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జగన్‌గౌడ్, కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, టీఆర్ఎస్ మైనార్టీసెల్ అధ్యక్షుడు నాజీమ్, షిరాజొద్దీన్, మోహీన్‌ఖాన్, ఖాజా, మైమూద్, చోటుఖాన్ సాబ్, నారాయణగౌ డ్, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, మే 1 : మండలంలోని కొత్తమొల్గరలో రైతుబంధు సమితి మండల క న్వీనర్ నర్సింహాగౌడ్ ముస్లింలకు ఇఫ్తార్‌విందు ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.