మహబూబ్‌నగర్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలోని సంక్షేమ పథకాలు తమ వద్ద కూడా అమలు చేయాలని.. అందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కర్ణాటక రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి డీకే అరుణ చొరవ తీసుకోవాలని కర్ణాటక రైతులు గత నెల 21 జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి వచ్చి మరీ విజ్ఞ ప్తి చేశారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉ చిత విద్యుత్, దళితబంధు వంటి పథకాలు తమకూ అందించేలా కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ దృష్టికి తీసుకెళ్లాలని బండి సంజయ్, డీకే అరుణకు వినతి పత్రం సమర్పించారు. వినతిపత్రం అందుకొని చదివిన తర్వాత బండి సంజయ్ వారి కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొద్దిసేపు తికమకపడ్డారు. చడీచప్పుడు చేయకుండా అక్కడి నుంచి పలాయ నం చిత్తగించారు. ఈ అంశంలో బీజేపీ నేతల తీరుపై కర్ణాటకలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంటే.. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఆమడదూరంలో ఉండిపోయిందని అంటున్నారు. కానీ, బీజేపీ నేత లు అన్నీ బాగున్న తెలంగాణలో పాదయాత్ర చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై కర్ణాటకలో ని తెలంగాణ సరిహద్దు పల్లెల్లో ‘నమస్తే తెలంగాణ’ అక్కడి రైతులు, స్థానికులను పలకరించింది. ఎవరిని కదిలించినా తెలంగాణ పథకాలు అద్భుతం అంటూ కొనియాడారు. త మ సమీపంలోనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అక్కడి సర్కార్ సకల సౌకర్యాలు, చక్కని పథకాలు ప్రవేశపెడితే.. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదంటూ వాపోయారు. తె లంగాణలో వృద్ధాప్య పింఛన్ రూ.2016, దివ్యాంగులకు రూ.3016 చొప్పున ఇస్తుండగా.. కర్ణాటకలో రూ.800, రూ.1200 మాత్రమే ఇస్తుండడంపై స్థానికులు పెదవి వి రుస్తున్నారు. ఏ విషయంలోనైనా తమ కంటే తెలంగాణ వాసులే అదృష్టవంతులంటూ కన్నడిగులు అంటున్నారు.
కన్నడిగులకూ రైతుబంధు..
ఓవైపు తెలంగాణ రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్.. తెలంగాణలో భూములున్న కర్ణాటక వాసులకు సైతం రైతుబంధు, రైతుబీమా ఇస్తూ పెద్ద మన సు చాటుకుంటున్నారు. నారాయణపేట జిల్లా కృష్ణ, మాగనూరు, ఊట్కూరు, నారాయణపేట, దామరగి ద్ద మండలాల పరిధిలోని కొల్పూరు, పుంజనూరు, ముడిమల్ దొడ్డి, మురహరిదొడ్డి, గుడెబల్లూరు, కు న్సి, చేగుంట, దుప్పల్లి, ఉజ్జెల్లి, సమిస్తాపూర్, అమీన్పూర్, బైరంకొండ, జిలాల్‌పూర్, ఎక్లాస్పూర్, కొం డారెడ్డిపల్లి, కాన్కుర్తి తదితర గ్రామాలు కర్ణాటకకు సరిహద్దుల్లో ఉంటాయి.
ఈ గ్రామాలకు ఆవల కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా పరిధిలోకి వచ్చే గూడూరు, కడేచూర్, సౌరాష్ట్రహల్లి, ఇడ్లూరు, సంక్లాపూర్, జే గ్రాం, అన్పూర్, నసలవాయి, పుట్‌పాక్, కుంటుమర్రి, మల్లూపూర్, మాణిక్యగిరి గ్రామాలున్నాయి. కర్ణాటకకు చెందిన ఈ గ్రామాల రైతులకు తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో సుమారు 2,500 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఈ భూములకు పెద్దగా డిమాం డ్ లేదు. కానీ, నేడు రైతుబంధు వచ్చాక కర్ణాటక రై తుల దశ తిరిగింది. 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయం చేసేందుకు పంట పెట్టుబడిగా రైతుబంధు సాయం, అనుకోకుండా రైతు మరణిస్తే రూ.5 లక్షల రైతుబీమా కర్ణాటక రైతులకు కూడా వర్తిస్తున్నది. కర్ణాటక రైతులు తెలంగాణలోని బ్యాంకుల్లో క్రాప్‌లోన్ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎక రా తరి పొలం రూ.10 నుంచి రూ.12 లక్షల ధర పలుకుతుంటే.. కర్ణాటక సరిహద్దులో ఉన్న తెలంగాణలో ఎకరా తరి పొలానికి కనీసం రూ.30 లక్షలు డి మాండ్ ఏర్పడింది.
కొందరు కర్ణాటక రైతులకు సరిహద్దుల్లో రెండు రాష్ర్టాల పరిధిలో భూములున్నాయి. అలాంటి భూములకు సైతం తెలంగాణ ఉచిత కరెం టు వాడుతూ రెండు వైపులా వ్యవసాయం చేసుకుంటున్నారు. కర్ణాటకలో వ్యవసాయానికి రోజుకు ఇచ్చే 7 గంటల కరెంటు కూడా పగలూరాత్రి తేడా లేకుం డా ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెం దుతున్నారు. అదే తెలంగాణలో అయితే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నారని రైతులు తెలిపారు. ఆ కరెంటు మమ్మల్ని ఆదుకుంటున్నదని సం తోషం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభు త్వం చేస్తున్నదేమీలేదని రైతులు వాపోతున్నారు. కనీసం వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా అం దుబాటులో ఉండరని, తెలంగాణలో అయితే పొలం వద్దకే వ్యవసాయాధికారులు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తున్నారంటున్నారు. కర్ణాటక రైతులకు సైతం రైతుబీమా కింద రూ.5 లక్షల పరిహారం అందుతోందని.. రైతులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని కన్నడిగులు చెబుతున్నా రు. తెలంగాణలో ఉన్న మా భూములకు సైతం విపరీతమైన డిమాండ్ వచ్చిందని సంతోషంగా వివరిస్తున్నారు. కర్ణాటక వాసులకు రైతుబంధు, రైతు బీమా వర్తించడంతోపాటు స్థానికంగా అధికార టీఆర్ఎస్ నేతలు, వారికి తెలిసిన వారి సాయం తీసుకుని బ్యాం కుల్లో క్రాప్లోన్లు తీసుకుంటున్నారు. చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
అబద్ధాల బండి..
మహాసంగ్రామ యాత్ర పేరిట ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్ నోటికొచ్చిన అబద్ధాలతో ప్రజలను వం చిస్తున్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అబద్ధపు మాటలతో ప్రజలను తప్పుదారి పట్టించారు. తెలంగాణలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని మళ్లీ పాతపాటే పాడారు. ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన బాధ్యతను మర్చిపోయి తెలంగాణపై వివక్షను ప్రదర్శిస్తున్నది. ఈ విషయాన్ని చెప్పకుండా తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక.. నారాయణపేటకు కృష్ణా-వికారాబాద్ రైల్వేలైన్ ద్వారా ట్రైన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సైనిక్ స్కూల్ విషయంలోనూ అదే తొండి మాటలు మాట్లాడారు. మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అనేకమార్లు కేంద్ర మం త్రులను కలిసి వెనకబడిన పేటకు సైనిక్ స్కూల్ ఇవ్వాలని, కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్ కోసం వినతి పత్రాలు ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. ఎనిమిదేండ్లుగా నారాయణపేటను పట్టించుకోని బీజేపీ సర్కార్ ఇప్పుడు పాదయాత్ర పేరిట ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలను వంచిస్తున్నది. ఇదే అంశంపై కర్ణాటక ప్రజలు మాత్రం వారి రాష్ట్రం లో రైతులకు అక్కడి ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదని.. తెలంగాణ పథకాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిస్తున్నారు. సమీపంలోనే
ఉన్న కర్ణాటక ప్రాంతానికి వచ్చి బీజేపీ వాళ్లు చేస్తున్నది ఏమిటో ఒకసారి చూస్తే సరిపోతుందని బండికి స్థానికులు సూచిస్తున్నారు.
స్పందించని బీజేపీ సర్కార్..
వ్యవసాయానికి కేవలం 7 గంటల కరెం టు మాత్రమే ఇస్తున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ పరిధిలో సుమారు 15 నుంచి 20 కనెక్షన్లున్నాయి. దీంతో లోడ్ ఎక్కువై ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు కాలిపోతుందో తెలియదు. క రెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుం దో కూడా అర్థం కావడంలేదు. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయించేందుకు రూ.వేలల్లో ఖర్చు అవుతున్నది. కరెంటు వాళ్లు లంచాలు లేకుండా పని చేయడం లేదు. మా పక్కనే ఉన్న తెలంగాణ రైతులకు మాత్రం అక్కడి సర్కార్ 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నది. అక్కడ కరెంటు సమస్య లేదు. కర్ణాటకలోని వ్యవసాయాన్ని నమ్ముకున్న నాలాంటి వాళ్ల పరిస్థితి దారుణంగా మారింది. విత్తనాలు కావాలన్నా తెలంగాణలోని నారాయణపేటకు రావాల్సిందే. వడ్లు అమ్మాలన్నా పేట మార్కెటే గతి. తెలంగాణ ప్రభుత్వమే అక్కడి రై తుల నుంచి వడ్లు కొంటున్నది. తెలంగాణ రైతులకు రూ.1960 మద్దతు లభిస్తున్నది. మా వడ్లు మాత్రం బయట మార్కెట్లో రూ.1200కు అమ్ముకోవాల్సి వస్తున్నది. బీజేపీ సర్కార్ మా సమస్యలపై కనీసం స్పందించడం లేదు.
– మహ్మద్ హనీఫ్, కర్ణాటక రాష్ట్రం
మా వద్ద కొనుగోళ్లు లేవు..
తెలంగాణలో రైతులకు స్వర్ణయుగం నడుస్తున్నది. అక్కడ సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతుబంధు కింద ఎకరాకు రూ.10వేల పంట పెట్టుబడి ఉచితంగా ఇస్తున్నారు. రైతుబీమా ద్వారా రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. కర్ణాటకకు చెందిన మా రైతులకు కూ డా తెలంగాణలో భూములున్నాయి. ఇటీవల కొందరు చనిపోతే వాళ్ల కుటుంబాలకూ రైతుబీమా సాయం అం దింది. మా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు లేవు. సర్కార్ పట్టించుకోవడం లేదు. రైతులపై నిర్లక్ష్యం చూపిస్తున్నారు. తెలంగాణలోని రైతు బాగుపడితే.. కర్ణాటకలో మాత్రం రైతులు ఆగమవుతున్నారు.
– మహ్మద్ హుస్సేన్, పుట్‌పాక్, కర్ణాటక రాష్ట్రం
తెలంగాణ పథకాలు కావాలి..
బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడన్న విషయం తెలుసుకొని కర్ణాటక నుంచి గద్వాలకు వచ్చాం. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంతో అద్భుతంగా ఉ న్నాయి. అవే పథకాలు మా రాష్ట్రంలోనూ అమలు చేసేలా చూడాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు వినతిపత్రం ఇచ్చాం. కర్ణాటక బీజేపీ ఇన్చార్జిగా ఉన్న డీకే అరుణకు సైతం మా గోడు వినిపించాం. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో మాట్లాడి ఈ పథకాలు కర్ణాటకలోనూ అమలయ్యేలా చూడాలని బండి సంజయ్‌ను కోరాం. అయినా స్పందన లేదు.
– జయన్న, గాజులపాడు, రాయిచూరు జిల్లా, కర్ణాటక
బొమ్మై దృష్టికి తీసుకెళ్లాలని కోరాం..
బండి సంజయ్ తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాం. బండి, డీకే అరుణను కలిశాం. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు మా రాష్ట్రంలోనూ అమలు చేయాలని బండి సంజయ్, డీకే అరుణను కోరాం. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, సీఎం బసవరాజ బొమ్మై దృష్టికి తీసుకుపోవాలని విన్నవించాం. మా సమీపంలోనే ఉండే తెలంగాణ రైతులకు అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయి. ఇలాంటి పథకాలు మా రాష్ట్రంలోనూ అమలైతే మా పరిస్థితులు కూడా మెరుగవుతాయని వారిని కోరాం.
– ఆంజనేయ, ఆత్కూరు గ్రామం, రాయిచూరు రూరల్, కర్ణాటక