భూత్పూర్, ఏప్రిల్ 30 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మం డలంలోని అన్నాసాగర్‌లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ యాసంగిలో వడ్లను కేంద్ర ప్రభుత్వం కొంటుందని వరిసాగు చేయించిన బీజేపీ నాయకులు బండి సంజ య్, కిషన్‌రెడ్డి, అరవింద్ రైతులను మోసం చేశారన్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.4వేల కోట్లను కేటాయించకపోవడం శోచనీయమన్నారు. బీజేపీపాలిత రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగం లో చేపట్టిన సంస్కరణలే కారణమని తెలిపారు. రైతులు ధా న్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, ఏవో మురళీధర్, సర్పంచ్ నీలిమ, కోఆప్షన్ సభ్యుడు ఖాజా, సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్‌గౌడ్, ఆల శశివర్ధన్‌రెడ్డి, రాజారెడ్డి పాల్గొన్నారు.
‘దళితబంధు’ను వేగవంతం చేయాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఆల అధికారులకు సూచించారు. అన్నాసాగర్‌లో ఎంపీడీవో మున్నితో సమావేశమై దళితబంధు యూనిట్లకు సంబంధించిన వివరాలను తె లుసుకున్నారు. కొందరు లబ్ధిదారులు యూనిట్లను మార్చాలని కోరుతున్నారని ఎంపీడీవో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించి ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడగా, యూనిట్లను మార్చుకునే అవకాశం ఉందని ఈడీ తెలిపారు. దళితబంధు పథకంపై ఏ అనుమానం వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఎమ్మెల్యేను కలిసిన తిమ్మాపూర్ రైతులు
మూసాపేట, ఏప్రిల్ 30 : మండలంలోని తిమ్మాపూర్ గ్రామ రైతులు శనివారం భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ గ్రామ సమీపంలోని పెద్దవాగు నుంచి ఇసుకను తరలించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇసుకను తరలించడంవల్ల వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం తగ్గుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే.. స్థానిక తాసిల్దార్‌ను ఫోన్లో సంప్రదించి రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.