ఊట్కూర్, ఏప్రిల్ 30 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ని ర్వహించే 8వ విడుత హరితహారం కార్యక్రమాన్ని కలిసికట్టుగా విజయవంతం చేద్దామని ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి పి లుపునిచ్చారు. మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం హరితహారంపై కార్యదర్శులు, ఈజీఎ స్, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ నర్సరీలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నర్సరీల్లో పెరుగుతు న్న మొక్కలకు ప్రతి రోజు నీళ్లు పట్టాలని సూచించారు. జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప మాట్లాడుతూ జూన్లో వర్షాలు కురువడమే ఆలస్యంగా ప్రభుత్వం లక్ష్యం మేరకు గ్రామాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచాలన్నారు. హరితహారం విజయవంతం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాల వారీగా నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కల వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళప్ప, ఉపాధి ఏపీవో ఎల్ల య్య, ఈసీ శ్రీనివాసులు పాల్గొన్నారు.