కోస్గి, ఏప్రిల్ 30 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ అధికారులు ప్రభుత్వం తరపున వడ్లు కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడానికి సు ముఖత చూపకపోయినా సీఎం కేసీఆర్ రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రకటించి అండగా ని లిచారన్నారు. కోస్గిలో రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేశామన్నారు. క్వింటాకు రూ.1,960 మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. దళారుల మాటలు నమ్మొద్దని ఆయన సూచించారు. అన్నదాత సంక్షేమమే ప్ర భుత్వ ధ్యేయమన్నారు. వారికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా ప్రభుత్వం కాపాడుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, ము న్సిపల్ చైర్పర్సన్ శిరీష, డీసీసీబీ డైరెక్టర్ భీంరెడ్డి, జెట్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, వైస్‌చైర్మన్ వరప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు మా స్టర్ శ్రీనివాస్, బాలేశ్, ఓంప్రకాశ్ తదితరు లు పాల్గొన్నారు.
రైతులు మద్దతు ధర పొందాలి
మద్దూర్, ఏప్రిల్ 30 : రైతులు ప్రభు త్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు విక్రయించి మద్ద తు ధర పొందాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఐకేపీ సెంట ర్ -2ను శనివారం ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రైతులను కాపాడుకునేందుకు రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దళారుల వ్యవస్థను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రాలు పని చేస్తాయన్నారు. రైతుల ఎదుటే ధా న్యం తూకం వేయాలని సూచించారు. తాగునీరు, నీడ సౌ కర్యం కల్పించాలన్నారు.
ఆప్యాయంగా పలకరిస్తూ …
మీ కష్టమే నా కష్టంగా భావించి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎ మ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చే న్వార్లో ‘మన ఊరు మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భా గంగా శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇల్లు లే ని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాం కుకు మరమ్మతులు చేయాలని, ప్రతి వార్డులో ప్రతి ఇంటికి నీరు అందించాలని, వారానికి ఒకసారి మంచినీటి ట్యాంకు శుభ్రం చేయాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించా రు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, స ర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి, సర్పంచ్ వరలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సి.వెంకటయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.