వనపర్తి టౌన్, ఏప్రిల్ 30 : నాణ్యతలేని విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. విత్తనాల లభ్యత, నఖిలీ విత్తనాల నిర్మూలన కో సం తీసుకోవాల్సిన చర్యలపై శనివారం డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి వ్యవసా య శాఖ కమిషనర్లు, ఎస్పీలు, టాస్క్‌ఫోర్స్ బృందాలతో మంత్రి నిరంజన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకి లీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్ నమో దు చేయాలని, రాష్ట్రంలో 60 లక్షల కు టుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. పత్తి విత్తనాలు అధి క ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని, ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా లేని విత్తనాలను పశువుల దాణా కింద మార్చుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వానకాలంలో ైగ్లెపోసైట్స్ అమ్మకాన్ని నిషేధించామని, ఎక్కడైనా దుకాణాల్లో కనిపిస్తే లైసెన్స్ రద్దు చేయాలని సూచించారు. పత్తి, మిర్చి విత్తనాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఏఎస్పీ షాకీర్‌హుస్సేన్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామన్నా రు. జిల్లాలోని 250 మంది డీలర్లతో స మావేశమై ప్రభుత్వ ఆదేశాలను వివరిస్తామని, నకిలీ విత్తనాల నిర్మూలన కో సం తనిఖీలు చేపడుతామన్నారు. సమావేశంలో వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్‌రెడ్డి, ఎస్సై రాము, అధికారులు పాల్గొన్నారు.
అన్ని పండుగలకూ సమ ప్రాధాన్యత
వనపర్తి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకూ సమ ప్రాధాన్యత ఇస్తుందని, రం జాన్ పండుగను ముస్లింలు సంతోషం గా జరుపుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రం లోని స్థానిక ఫంక్షన్హాల్లో జిల్లా మై నార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మైనార్టీల విద్య, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు. అనంతరం ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనీల్, టీఆర్ఎస్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు జోహెబ్, వక్ఫ్‌బోర్డు సభ్యుడు జహంగీర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, రైతుబంధు సమి తి మండలాధ్యక్షుడు నర్సింహ, యూత్ మండలాధ్యక్షుడు రాము, కో ఆప్షన్ సభ్యుడు గులాం ఖాదర్, మహ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.