వనపర్తి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : సప్తసముద్రాల కన్నా ముందే కాకతీయ సామంతరాజులు గ ణపసముద్రాన్ని నిర్మించారని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ చెరువుకు 800 ఏండ్లకుపైగా చరిత్ర ఉన్నదన్నారు. గణప సముద్రం పునర్నిర్మాణం చేపట్టి ఘణపురం ఖ్యాతిని మరింత పెంచుతామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో నీటి పారుదల నిపుణుల కమిటీతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ గణప సముద్రం కట్ట గట్టుకాడిపల్లికి రహదారిగా మారబోతుందన్నారు. ఘనపురం గ్రామానికి ఇబ్బంది లేకుండా ఈ చెరువు చుట్టూ కరకట్టల నిర్మాణం చేపడుతామని తెలిపారు. కట్టపై సుందరీకరణ పనులు చేపడుతామన్నారు. ఘణపురం కోట ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి.. అందుకే టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుద్ధారం కట్ట ఎత్తు పెంపును పరిశీలించాలని అధికారులకు సూచించారు. బుద్ధారం స్టేజ్ -1, స్టేజ్ పనులను త్వరలో ప్రారంభించాలని ఆదేశించారు.
బుద్ధారం కాలువ కింద ఆయకట్టు కోసం సర్వే పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. కల్వకుర్తి ఆయకట్టు కింద ఆన్లైన్ రిజర్వాయర్లు వెంటనే నిర్మించాలని కోరారు. ఏదుల రిజర్వాయర్ వద్ద తూమును నిర్మించాలని ఆదేశించారు. గణపసముద్రం, బుద్ధారం పెద్ద చెరువులను రిజర్వాయర్లుగా మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ రెం డు చెరువులను నిపుణుల కమిటీ సందర్శించి ప్రభుత్వా నికి నివేదిక అందించనున్నట్లు చెప్పారు. అనంతరం పనులకు టెండర్లు ఆహ్వానిస్తామని మంత్రి వివరించారు. సమావేశంలో నీటి పారుదల నిపుణుల కమిటీ సీఈ శ్రీనివాస్, వనపర్తి చీఫ్ ఇంజినీర్ రఘునాథ్‌రావు, నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజినీర్ హమీద్‌ఖాన్, ఎస్ఈలు సత్యనారాయణరెడ్డి, సత్యశీలారెడ్డి, శ్రీనివాస్, డీఈ సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గణపసముద్రం చెరువు పరిశీలన
ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 30 : మండలంలోని ప్ర సిద్ధి చెందిన గణపసముద్రం చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీం తో శనివారం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీఈ) శ్రీనివాస్, వనపర్తి చీఫ్ ఇంజినీర్ రఘునాథరావు, నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజినీర్ హమీద్‌ఖాన్ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 800 వందల ఏండ్లకుపైగా చరిత్రగల గణప సముద్రాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి నిరంజన్‌రెడ్డి పునర్నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు చేశారన్నారు. ఈ మేరకు చె రువును పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఈలు సత్యనారాయణరెడ్డి, సత్యశీలారెడ్డి, శ్రీనివాస్, డీఈ సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.