నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 29 : రై తులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా.. వారికి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ధాన్యం కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తా వద్ద ఉన్న మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాల్సి ఉన్నా విస్మరించిందన్నారు. కానీ, సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు.
క్విం టాకు రూ.1960 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు చెప్పారు. రూ.4 వేల కోట్ల నష్టం వచ్చినా కొంటున్నామన్నారు. పంటల ను చూసి ప్రతిపక్షాలకు కండ్లు మండి అడ్డుపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ స్వలాభం కో సం ప్రజలను ఇబ్బందులు పె డుతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యేను మార్కెట్ కమిటీ నాయకులు, వ్యాపారులు స న్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్రె డ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, వైస్ చై ర్మన్ జైపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, జెడ్పీటీసీ శ్రీశైలం, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంత్‌రా వు, విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారిణి బాలమణి పాల్గొన్నారు.