పేదలకు, సబ్బండ వర్గాలకు అండగా నిలిచిన టీఆర్ఎస్కు ప్రతిఒక్కరూ జెండాపట్టి జై కొట్టారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూవాడ, పల్లె, పట్టణాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ప్రతి వాడా గులాబీమయమైంది. హైదరాబాద్‌లో ప్లీనరీకి ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు
భారీగా తరలివెళ్లారు.
– మహబూబ్‌నగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబురాన్నంటాయి. గ్రామాలు, పట్టణాల్లో గులా బీ జెండా రెపరెపలాడింది. సర్పంచులు, నేతలు, ప్రజాప్రతినిధులు సంబురాలు చేసుకున్నారు. బుధవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్లీనరీకి ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్పర్స న్లు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. ప్లీనరీలోని తీర్మానాల్లో మంత్రులు, విప్ తమ వంతు పాత్ర పోషించా రు. యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తీర్మానం చేశారు.
కేంద్రం అన్నదాతలను మోసం చేసిన విధానాన్ని మంత్రి వివరించారు. నిస్సిగ్గుగా కేంద్రం తన బాధ్యతనుంచి తప్పుకొన్నదని, రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం బాధ్యతను తీసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని చేసిన తీర్మానాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బలపర్చారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణే లేదన్నారు. రాష్ట్రంపై పీఎం మోదీ విషం చిమ్మిన విషయంపై మాట్లాడారు. అభి వృద్ధి చెందుతున్న రాష్ర్టాన్ని అణచివేయాలనే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని చేసిన తీర్మానాన్ని అచ్చంపేట ఎ మ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు బలపర్చారు. దళితులు బాగుపడేందుకు గతంలో ఎవరూ కనీసం ప్రయత్నించలేదని, సీఎం కేసీఆర్ వల్లే వారి ఆర్థిక పరిస్థితులు బా గుపడుతున్నాయన్నారు.