నారాయణపేట జిల్లా కేంద్రంతోపాటు నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో , కోస్గిలో బుధవారం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జెండావిష్కరణ చేసి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా సంబురాల్లో పాల్గొన్నారు. అభిమానులు ఇండ్లపై టీఆర్ఎస్ జెండాలు ఎగురవేశారు.
నారాయణపేట/టౌన్/రూరల్, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని 6వ వార్డులో పార్టీ జెండాను మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కన్నా జగదీశ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు రాఘవేంద్ర, ఉపాధ్యక్షుడు కమల్, నాయకులు సూరి, నారాయణ, మల్లప్ప, లక్ష్మీకాంత్, శ్రీధర్ పాల్గొన్నారు. 8వ వార్డులో కౌన్సిలర్ శిరీష జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, సీనియర్ నాయకులు ప్రతాప్‌రెడ్డి తదితరులు తెలంగాణ ఉద్యమకారులు సరాఫ్ నాగరాజు, యాంకి హన్మంత్‌రెడ్డి, బండి మల్రెడ్డి, రాంరెడ్డిని సన్మానించారు.
2వ వార్డుల్డో కౌన్సిలర్ అనిత టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ నాయకులు సరాఫ్ నాగరాజు, బండి మల్రెడ్డి, సుతారి రాంరెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాష్, నాయకులు దేవరాజ్, సీతారాములు, అనంత్‌రెడ్డి, శివకుమార్, ఆనంద్, గోపాల్, తిరుపతి పాల్గొన్నారు. 4వ వా ర్డులో టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు శ్రీ నివాస్, తిరుపతి, వెంకటేశ్, నర్సమ్మ, భారతి, అనంతమ్మ పాల్గొన్నారు. మండలంలోని జాజాపూర్, సింగా రం, కోటకొండ ,పేరపళ్ల, అప్పక్‌పల్లి, ఊటకుంటతండా, వందర్గుట్టతండా, కొల్లంపల్లి తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి సభ్యులు కోట్ల జగన్మోహన్రెడ్డి, విండో చైర్మన్ నర్సింహారెడ్డి ఆయా గ్రామాల నాయకులు శేఖర్, శాంతకుమార్, అలీశేర్, నారాయణరావు, రవీందర్‌గౌడ్, సాయిరెడ్డి, వెంకట్‌నాయక్, బస్సప్ప, హన్మంతు పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్, ఏప్రిల్ 27: మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఎగురవేసి కార్యకర్తలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, వైస్‌ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ కస్పే గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. జిన్నారం, రాకొండ, పల్లెగడ్డ తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, బసంత్, రాజేశ్, మతీన్, రామస్వామి, ఎంపీటీసీ గోపాల్, ఉపసర్పంచ్ శివకుమార్, జిన్నారం సర్పంచ్ భాస్కర్, శంకర్‌గౌడ్, సాయిరెడ్డి పాల్గొన్నారు.
ఊట్కూర్ మండలంలో..
ఊట్కూర్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయాల్లో పార్టీ నాయకులు పూజలు చేశా రు. ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గులాబీ జెండాలను ఎగరేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, స ర్పంచులు సుమంగళ, మాణిక్యమ్మ, సరోజ, పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, సురేశ్, నాయకులు గోవిందప్ప, విజయభాస్కర్‌రెడ్డి, కతలప్ప, సమృద్ధి పాల్గొన్నారు.
కేసీఆర్ కలలుగన్న తెలంగాణ సాకారం
మక్తల్ టౌన్, ఏప్రిల్ 27: సీఎం కేసీఆర్ కలలుగన్న తెలంగాణ సాకారమైందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్ అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని 9వ వార్డులో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. మూడోవార్డు కేశవనగర్‌లో కౌన్సిలర్ జగ్గలి రాములు ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. 5వ వార్డులో కౌన్సిలర్ మొగిలప్ప ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ అనిల్ గాయత్రి, టౌన్ ఉపాధ్యక్షుడు కర్రెం కృష్ణ, కౌన్సిలర్ మొగిలప్ప, భీమయ్య, బిల్డర్ తాయప్ప, నాగిరెడ్డి, మారుతి పాల్గొన్నారు.
మక్తల్ మండలంలో..
మక్తల్‌రూరల్, ఏప్రిల్ 27: మక్తల్ మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు తమ ఇండ్లపై గులాబీ జెండాలను ఎగుర వేశారు. రుద్రసముద్రం గ్రామంలో సర్పంచ్ లక్ష్మి పార్టీ జెండాను ఆవిష్కరించారు. మంథన్‌గోడ్, దాదన్‌పల్లి, గుడిగండ్ల, జక్లేర్, కర్ని, ఎర్సన్పల్లి, మహాద్వార్ తదితర గ్రామాల్లో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటయ్య, చిట్టెం యువసేన నాయకుడు హుసేన్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, ఏప్రిల్, 27 : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ గ్రామానా సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ జెండాలు ఎగురవేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు గిరిజోషి, ప్రధాన కార్యదర్శి మోనేశ్, ఉపాధ్యక్షుడు శంకర్‌నాయక్, జెడ్పీటీసీ తనయు డు శివరాజ్‌పాటిల్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ధన్వాడలో
ధన్వాడ, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం మండలకేంద్రంలో ఘనంగా జరుపుకొన్నారు. టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం కార్యకర్తలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల, జిల్లా, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద ఏప్రిల్ 27: మండంలోని వివిధ గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ దామోదర్‌రెడ్డి ఎంపీటీసీ కిషన్‌రావు, సర్పంచ్ వన్నడి ఆశమ్మ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గి, ఏప్రిల్ 27: మండలంలో గ్రామగ్రామానా పార్టీ జెండా ఎగురవేసి పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నా రు. మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు, నాయకులు జెండావిష్కరణచేసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాగనూర్‌లో..
మాగనూర్ ఏప్రిల్ 27: మండలకేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో మక్తల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాకిటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు రాజు, నర్సింహులు, రామస్వామి, ఆశోక్‌గౌడ్, పద్మమ్మ, తార, మంజులారాఘవేంద్ర, సాయమ్మ, సింగిల్‌విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, వైస్‌ఎంపీపీ తిప్పయ్య తదితరులు పాల్గ్గొన్నారు.