మక్తల్ టౌన్, ఏప్రిల్ 26 : ముస్లింలకు రంజాన్ తోఫా లు పంపిణీ చేస్తున్నట్లు వీజేఆర్ ట్రాస్ట్ వ్యవస్థాపకుడు వ ర్కటం జగన్నాథ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పలు కాలనీ ల్లో రెండువందల ముస్లింలకు మంగళవారం జగన్నాథ్‌రెడ్డి రంజాన్ తోఫాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రూ.550 విలువ గల రంజాన్ తోఫాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా మక్త ల్ నియోజకవర్గంలో దాదాపు వెయ్యి వందికి రంజాన్ తోఫాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెద్ద మసీదులో ఇఫ్తార్ విందు
కోయిలకొండ, ఏప్రిల్ 26 : మండ లకేంద్రంలోని పెద్ద మసీదులో రంజా న్ సందర్భంగా ముస్లింలకు గౌడ సం ఘం నాయకుడు పవన్కుమాన్ ఆ ధ్వర్యంలో మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశా రు. అంతకుముందు ము స్ల్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించా రు. కార్యక్రమంలో నాయకులు జగన్‌గౌడ్, విద్యాసాగర్‌గౌడ్, రాజుగౌడ్, నా గరాజు, రామస్వామి, వీరన్న గౌడ్, ర ఘు, యాదవ్‌కుమార్, అజెల్లిఖాన్, ఇంతియాజ్, యూనిస్, దస్తు, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
వల్లూర్‌లో..
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 26 : మండలంలోని వల్లూర్‌లో సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వీరేశ్, రవినాయక్, సలాం, నర్సింహులు, చెన్నయ్య, శేఖర్, అంజిబాబు, శంకర్, మల్లేశ్, కనకయ్య, గౌస్‌పాషా, ఖాజాపాషా, ఇంతియాజ్, తాహేర్ పాల్గొన్నారు.