దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 25 : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుం ట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు. అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా గ్రా మాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.
రంజాన్ తోఫాలు పంపిణీ
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం సరఫరా చేసిన ఈద్ తోఫాలను ఎమ్మెల్యే ఆల ముస్లింలకు పంపిణీ చేశారు. రంజాన్ పండుగను ప్రతిఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఈద్ తోఫాను అందిస్తున్నదని తెలిపారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చె క్కులను పంపిణీ చేశారు. పర్ధీపూర్కు చెందిన కృష్ణారెడ్డికి రూ.10వేలు, గూడూర్ గ్రామవాసి పార్వతమ్మకు రూ.9వే లు, పల్లమర్రికి చెందిన అనితకు రూ.28వేలు, కురుమూర్తికి రూ.28వేలు సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యాయ ని తెలిపారు. అలాగే ముచ్చింతల గ్రామానికి చెందిన మల్లెల శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి, అమ్మాపూర్‌కు చెందిన కృష్ణ య్య కుటుంబానికి మంజూరైన రైతుబీమా చెక్కులను అందజేశారు. అనంతరం కురుమూర్తిస్వామి ఆలయ ప్రాంగణం లో రత్నమాల బ్రహ్మానందాచారి స్మారక కళాభవనం నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.