మహబూబ్‌నగర్, ఏప్రిల్ 25 : ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో సోమవా రం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇంటర్ పరీక్షలు మే 6నుంచి 19వ తేదీవరకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఇందు కు జిల్లావ్యాప్తంగా 32 పరీక్షాకేంద్రాలను ఏ ర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 11,025మంది, ద్వితీయ సంవత్సరం 10,694మంది వి ద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని తెలిపారు. అలాగే మే 23నుంచి జూన్ 1వ తేదీవరకు ఉదయం 9:30నుంచి మధ్యా హ్నం 12:45 గంటల వరకు పదోతరగతి పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 13,330మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ప్రధానంగా తాగునీరు అందుబాటులో ఉం డాలని, విద్యుత్ అంతరాయం కలుగకుం డా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్షాకేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స సౌకర్యం ఏర్పాటు చేయాలని, పరీక్షల సమయంలో ఎక్కువ ఆర్టీసీ బస్సులను నడపాలని అధికారులను ఆదేశించారు. పరీ క్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, డీఐఈవో వెంకటేశ్వర్లు, డీఈవో ఉషారాణి ఉన్నారు.
దోమలరహిత జిల్లాగా మార్చుకుందాం
పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని దోమలరహిత జిల్లాగా మార్చుకుందామని కలెక్టర్ వెంకట్రావు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. మలేరియా నియంత్రణకు మే, జూన్‌లో అన్ని సెప్టిక్ట్యాంక్ల గొట్టాలకు దోమతెరల ఏర్పాటు, మురుగుకాల్వల్లో గంబుషియా చేపపిల్లలను వదలడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. అలాగే దోమలవల్ల వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తలిపారు. అనంతరం మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన కరపత్రాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
వ్యర్థాల నిర్వహణ పాటించాలి
అన్ని దవాఖానల్లో జీవవ్యర్థాల నిర్వహణ పాటించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండ లి, రెవెన్యూ, పోలీస్, వైద్యారోగ్య శానిటరీ ఇన్స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దవాఖానల తనిఖీకి టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని దవాఖానలను తనిఖీ చేసి జీవవ్యర్థాల నిర్వహణ పాటిస్తున్నారా లేదా అనే దానిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు తప్పనిసరిగా జీవ వ్యర్థాల నిర్వహణ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. దీనిపై దవాఖానలకు నోటీసుపలు జారీ చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు.
ప్రజావాణికి 82 ఫిర్యాదులు
కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రావు ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజావాణి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, డీఎంహెచ్‌వో కృష్ణ, జెడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీవో యాదయ్య, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దయానం ద్, డీపీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.