నారాయణపేట టౌన్, ఏప్రిల్ 25 : పేదలకు కొండంత అండగా టీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మండలం, పట్టణానికి చెం దిన 27 మంది లబ్ధిదారులకు సోమవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలకు పెద్దన్నలా వ్యవహరిస్తూ కులమతాలకతీతంగా వారి పెండ్లికి కల్యాణలక్ష్మి, షా దీముబారక్ పథకాలతో ఆర్థికసాయం అందజేస్తున్నారన్నా రు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికీ సంక్షేమ పథకాలు అ మలు చేస్తూ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ హరినారాయణ భట్టడ్, పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, నాయకు లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేత
నారాయణపేట రూరల్, ఏప్రిల్ 25 : మండలంలోని సింగారం గ్రామానికి చెందిన హనుమంతుకు సోమవారం క్యాంపు కార్యాలయంలో రూ.లక్ష ఎల్వోసీ మంజూరు ప త్రాన్ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అందజేశారు. హనుమంతు కొన్ని రోజులుగా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధికి చికిత్స చేసుకోవడం కోసం ఎల్వోసీ మంజూరు చేయడంపై ఆయన ఎమ్మెల్యే, గ్రామ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అనసుయ, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాము లు, మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రె డ్డి, హనుమంతు తదితరులు పాల్గ్గొన్నారు.
సంక్షేమ పథకాలు పేదలకు వరం
ధన్వాడ, ఏప్రిల్ 25 : సంక్షేమ పథకాలు పేదలకు వరమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో సో మవారం 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదలకు వరమన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా అవేవి పట్టించుకోకుండా ప్రతి పేద కుటుంబానికి పెద్దన్నలా ఆదుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతకుముందు స్థాని క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలకు 28 స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం కిష్టాపూర్ మాజీ మం డల అధ్యక్షుడు, దివంగత యుగేంధర్‌రెడ్డి 3వ వర్ధంతి సం దర్భంగా ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గ్గొని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రామ్‌మనోహర్‌రావు, మండల వైద్యాధికారి వెంకటదాస్, తాసిల్దార్ బాలచందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచులు అమరేందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, జెడ్పీటీసీ విమల, ఎంపీటీసీలు, మండల ప్రధానకార్యదర్శి చం ద్రశేఖర్, యూత్ అధ్యక్షుడు సునీల్, ఉపాధ్యక్షుడు సచిన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గ్గొన్నారు.