మక్తల్ రూరల్, ఏప్రిల్ 25 : గ్రామ దేవతల ఆశీస్సులు ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని జక్లేర్‌లో నూతనం గా నిర్మించిన భూ లక్ష్మమ్మ ఆలయ ప్రారంభోత్సవానికి సో మవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆరంభించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్వకాలం నుంచి ప్రతి గ్రామంలో గ్రామ దేవతలకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నా రు. గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గ్రామానికి ఎలాంటి అరిష్టం జరుగకుండా, ప్రజలు ఆరోగ్యంగా, సు:ఖ సంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతకు మొక్కులు చెల్లించుకోవడంతో అంతా మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామస్తులందరూ కలి సి భూ లక్ష్మమ్మ ఆలయం నిర్మించుకోవడంపై ఎమ్మెల్యే అభినందించారు.
ఎడ్లబండ్ల పోటీలు
భూ లక్ష్మమ్మ ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా గిరక బండి లాగుడు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. పోటీలు ప్రశాంత వాతావరణంలో ని ర్వహించుకోవాలన్నా రు. ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు జరుగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
చిట్యాలలో…
మండలంలోని చిట్యాల శ్రీనిశ్చిలానంద లింగయ్యార్యుల నూతన మఠం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామిజీ ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి ఆశీస్సులు అందజేశారు. కా ర్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, ఎంపీటీ సీ సుజాత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అన్ని మతాలకు ప్రాముఖ్యత
మక్తల్ టౌన్, ఏప్రిల్ 25 : సీఎం కేసీఆర్ అన్ని మతాల కు సమ ప్రాముఖ్యత కల్పిస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభాత్ బజార్‌లోని జామియా మసీదులో ముస్లింలకు రంజాన్ తోఫాలను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్ర తి ఏటా దసరా, క్రిస్మస్, రంజాన్ పండుగలకు ప్రభుత్వం దుస్తులను పంపిణీ చేసి పేదల్లో సంతోషం నింపుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా పం డుగలు జరుపుకోవాలని ప్రభుత్వం దుస్తులను పంపిణీ చే స్తున్నదన్నారు. మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. రంజాన్ మా సంలో రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ప్రా ర్థించాలని కోరారు. అదేవిధంగా మైనార్టీ విద్యార్థుల కోసం మైనార్టీ గురుకులా లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
మాగనూర్, ఏప్రిల్ 25 : మండలంలోని నేరడగం బీరలింగేశ్వరస్వామి బండారు ఉత్సవాన్ని సోమవారం ఘనం గా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బండారు ఉత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. స్వామి వారికి ప్రత్యేక పూ జలు చేశారు. ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ అశోక్‌గౌడ్, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఆనంద పూజారి, చెన్నప్ప, సిద్ధప్ప, ఫకీరప్ప, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.