నారాయణపేట టౌన్, ఏప్రిల్ 24 : జిల్లాలోని నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం లో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ పరీక్షకు విశేషస్పందన లభించింది. నారాయణపేట, మక్తల్, నర్వలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నర్వ మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 250 మంది విద్యార్థులు, నారాయణపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏ ర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 350 మంది విద్యార్థులు, మక్తల్ పట్టణంలోని సీవీ రామన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 400 మంది విద్యార్థులు పరీక్ష రా శారు. రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1000 మం ది విద్యార్థులు పరీక్ష రాసినట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ క ళాశాలలో ఏర్పాటు చేసిన పరీ క్షా కేంద్రంలో యూటీఎఫ్ ఉ మ్మడి జిల్లా నాయకుడు లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి బాలాజీ, సీఐటీ యూ జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి ప్రశ్నా పత్రాలను విడుదల చేసి కేంద్రాన్ని పరిశీలించారు.
అదేవిధంగా మక్తల్ పట్టణంలోని పరీక్షా కేంద్రాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు కాశీ, మహేందర్ పరీశీలించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ఉమ్మడి జిల్లా నాయకుడు లక్ష్మ ణ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ త్వరలో జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రతి ఏడాది టాలెంట్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కాశీ, నాయకులు మహేశ్, మహేందర్, వెంకటేశ్, సనభేగం, శిరీష, పవన్, శివకుమార్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.