మిడ్జిల్, ఏప్రిల్ 17 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి మండల అధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌గౌడ్‌ను ఎన్నిక చేసినట్లు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి దేశంలో ఎక్కడాలేని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రైతులకు ఏ కష్టం రానివ్వకుండా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందరూ అండగా నిలువాలని కోరారు. అనంతరం రైతుబంధు సమితి నూతన అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ను సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీటీసీ సుదర్శన్, నాయకులు సుధాబాల్రెడ్డి, జంగిరెడ్డి, జైపాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు, చంద్రయ్యగౌడ్, భీంరాజు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.