జడ్చర్లటౌన్, ఏప్రిల్ 16 : హనుమాన్ జయంతి ఉత్సవాలను శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని పలు ఆలయాల్లో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. హిందూవాహిని ఆధ్వర్యంలో నాగసాల ఆంజనేయస్వామి ఆలయం నుంచి చేపట్టిన శోభాయాత్ర పట్టణ రహదారులమీదుగా కనులపండువగా సాగింది. శోభాయాత్రలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు. అంతకుముందు నిమ్మబావిగడ్డ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పాతబజార్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, హిందూవాహిని సభ్యులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మండలకేంద్రంతోపాటు గాధిర్యాల్, చౌదర్పల్లి, మొకర్లాబాద్, వెంకట్‌రెడ్డిపల్లి, కంచన్‌పల్లి తదితర గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జూలపల్లి, కోల్బాయితండాలో హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు చేశారు. అలాగే రథోత్సవం, అన్నదానం కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్ రాథోడ్, రమేశ్, లక్ష్మణ్ పవార్, లాలూ, నిఖిల్, టాక్య్రా, తులసీరాం, లక్ష్మణ్‌నాయక్, కృష్ణయ్య, సంజుకుమార్, లింబాజీ రాథోడ్, లింగ్యానాయక్ పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
మండలంలోని పలు గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవంగా జరుపుకొన్నారు. కొంరెడ్డిపల్లిలో నిర్వహించిన హనుమాన్ పల్లకీసేవలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పగిడ్యాల్, బల్సూర్గొండ, కొండాపూర్, సల్కర్‌పేట, గండీడ్, వెన్నాచేడ్, పెద్దవార్వల్, చిన్నవార్వల్, రుసుంపల్లి తదితర గ్రామాల్లో హనుమాన్ చాలీసా పారాయణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కప్లాపూర్లో హనుమాన్ భజనపరులకు వెన్నాచేడ్ రాములు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంగయ్య, కృష్ణయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మండలకేంద్రంతోపాటు బోయిన్పల్లి, కొత్తపల్లి, చిల్వేర్, వేముల గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి అభిషేకం, అర్చనలు చేశారు. సాయంత్రం హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు రాధికారెడ్డి, నారాయణరెడ్డి, ఎంపీటీసీ గౌస్, ఆలయ కమిటీ చైర్మన్ శంకర్, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ అల్వాల్‌రెడ్డి, నాయకులు సుధాబాల్రెడ్డి, రాజేశ్వర్, వెంకట్‌రెడ్డి, శేఖర్, రామకృష్ణ, శ్రీను, హరిగౌడ్, భాస్కర్, రాఘవేందర్, ఆచారి, కరుణాకర్‌రెడ్డి, మల్లేశ్, తిరుపతి, గోపాల్, జగన్‌గౌడ్, ఆంజనేయు లు, నర్సింహ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
మండలకేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో కుంకుమార్చన తదితర పూజలు చేశారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు, సర్పంచ్ విజయలక్ష్మి ఏఎస్సై నాగేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ గిరిధర్‌రావు, వార్డుసభ్యులు అఫ్సర్‌ఖాన్, భాస్కర్, టీఆర్ఎస్ యూత్వింగ్ మండల ప్రధానకార్యదర్శి సూరి, తిరుపతి, దత్తాత్రేయ, గణేశ్ పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఏప్రిల్ 16 : మండలకేంద్రంతోపాటు చొక్కంపేట, దోండ్లపల్లి, తిర్మలాపూర్, చెన్నవెల్లి, కుచ్చర్కల్, ఈద్గాన్‌పల్లి, మల్లేపల్లి తదితర గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతనం హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, ఏప్రిల్ 16 : మండలంలోని టంకర, వేపూర్, నాయినోనిపల్లి, ఇబ్రహీంబాద్, హన్వాడ, గొండ్యాల, షేక్‌పల్లి గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, ఏప్రిల్ 16 : మండలకేంద్రంతోపాటు కొల్లూరు, పోమాల, హన్మసానిపల్లి, యన్మన్గండ్ల, కొండాపూర్ తదితర గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర, ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం హనుమాన్ ఆలయాల్లో ప్రత్యే క పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచులు గోపాల్‌గౌడ్, సౌజన్య, కృష్ణయ్య, బొజ్జమ్మ, కొల్లూరు నాయకులు రఘు, చందర్‌నాయక్, నర్సింహాచారి, సేవ్యానాయక్, గోపాల్‌గౌడ్, రఘుగౌడ్, రామకృష్ణ, చంద్రమోహన్, భరత్‌కుమార్, సుధాకర్, లింగం తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, ఏప్రిల్ 16 : మున్సిపాలిటీలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ ప్రారంభించారు. అనంతరం హనుమాన్ శోభాయా త్ర నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, వెంకట్రాజ్, నరేందర్‌గౌడ్, సత్యనారాయణ, బోరింగ్ నర్సింహులు, శ్రీశైలం, మల్లేశ్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
మహబూబ్‌నగర్ రూరల్, ఏప్రిల్ 16 : మండలంలోని ధర్మాపూర్, కోడూర్, కోటకదిర, మాచన్‌పల్లి, పోతన్‌పల్లి, అల్లీపూర్, జైనల్లీపూర్, జమిస్తాపూర్, ఇప్పలపల్లి, గాజులపేట గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు.
దేవరకద్ర, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 16 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. చిన్నరాజమూర్, దేవరకద్ర, కౌకుంట్ల, నాగారం, లక్ష్మీపల్లి తదితర గ్రామాల్లో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దేవరకద్రలో హిం దూవాహిని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
మూసాపేట, అడ్డాకుల మండలాల్లో..
మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 16 : హనుమాన్ జ యంతి ఉత్సవాలను అడ్డాకుల, మూసాపేట మండలకేంద్రాలతోపాటు పెద్దమునగల్‌చేడ్, బలీదుపల్లి, కన్మనూరు, శాఖాపూర్, కందూరు, పొన్నకల్, రాచాల, కాటవరం, ని జాలాపూర్, సంకలమద్ది, వేముల, దాసరిపల్లి, జానంపేట, కొమిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, ఏప్రిల్ 16 : మండలంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. మండలకేంద్రంలోని ఆది ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం చేశారు. అలాగే హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, జగన్‌గౌడ్, విద్యాసాగర్, రాధాకృష్ణ, రవి, వెంకట్రాములు, హన్మంతు, శ్రీహరి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.