జడ్చర్లటౌన్, ఏప్రిల్ 16: విద్యార్థులు జీవితంలో లక్ష్యసాధన కోసం ధైర్యంగా, సానుకూల దృక్పథంతో కృషి చేస్తే విజయాలు సొంతమవుతాయని జీఎంఆర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సీఈవో అశ్వనిలోహానీ, ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ రమేశ్‌భట్ అన్నారు. జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం, నర్సీ మాంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్(ఎన్ఎంఐఎంఎస్) జడ్చర్ల క్యాంపస్‌లో శనివారం ఎస్బీఎం కాన్వొకేషన్ సెరిమెనీ-2022 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంబీఏ, పీజీడీఎం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ కాన్వొకేషన్ పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా జీఎంఆర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సీఈవో అశ్వనిలోహానీ, గూంజ్, గ్రామ్ స్వాభిమాన్ వ్యవస్థాపక డైరెక్టర్ అన్షుగుప్తా, ఎన్ఎంఐఎంఎస్ వీసీ రమేశ్‌భట్ హాజరయ్యారు.
మొదటగా జడ్చర్ల క్యాంపస్‌లోని రెసిడెన్షియల్ సదుపాయాలను ప్రారంభించారు. అనంతరం జడ్చర్ల క్యాంపస్‌లో ఎంబీఏ, పీజీడీఎం, ఇతరత్రా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కన్వొకేషన్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. హైదరాబాద్ క్యాంపస్ డైరక్టర్ తపన్పాండా, ప్రొఫెసర్ వైస్‌చాన్స్‌లర్ మీనా చింతమనేని మాట్లాడుతూ తెలంగాణలో విద్యాహబ్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకుసాగుతున్నామన్నారు. నిమ్స్ యూనివర్సిటీ పరిధిలోని జడ్చర్ల క్యాంపస్‌లో ఎంబీఎ, పీజీడీఎం, బీబీఏ, బీకాం, బీఏ, ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ కోర్సులు కొనసాగిస్తున్నామన్నారు. త్వరలో ఇంజినీరింగ్, ఫార్మసీ బీఎస్సీ, డాటా ఎనలిటిక్స్, సైకాలాజీ వంటి కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్బీఎం, ఎన్ఎంఐఎంఎస్ హైదరాబాద్ క్యాంపస్ చైర్ డైరెక్టర్ జి. రాధాకృష్ణ, వై.ఎల్ఎన్ కుమార్ పాల్గొన్నారు.