మద్దూర్, ఏప్రిల్ 14 : గిరిజనుల ఆరాధ్య దైవమైన గురులోకా మాసంద్ ప్రభువు (బావాజీ) మ హా జాతర రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచినది. నాలుగు రోజులపాటు జరిగే జాతరకు రాజస్థాన్, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఏపీ నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. కుటుంబసమేతంగా ప్ర భువును దర్శించుకొని మొక్కలు తీర్చుకుంటారు. జాతర పూర్తయ్యేవరకు సుమారు 60 నుంచి 80 వేల మేకలు, గొర్రెలు బలివ్వడం ఇక్కడి ప్రత్యేకత.
ఆలయ నేపథ్యం..
పురాణగాథలు, స్థానికుల కథనం మేరకు.. నా రాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో బావాజీ 16వ శతాబ్ధం మధ్య కాలంలో లక్ష్మీబాయి, రాంజీ మహారాజ్ దంపతులకు చైత్ర శుద్ధ పౌర్ణమిన జన్మించారు. తన పసివయస్సులోనే పశువుల కాపరిగా ఉంటూ స్నేహితు లు, గ్రామస్తులకు భక్తి మార్గాల గురించి ప్రవచనా లు వివరించేవారు. 10వ ఏట పంజాబ్ రాష్ట్రంలో ని అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడే కఠోర నియమాలతో 12 ఏండ్లపాటు గురుగ్రంథాన్ని పఠించారు. అక్కడి నుంచి రాజస్థాన్లోని చేలీడ్ కాళికాదేవి ఆలయాన్ని దర్శించుకుని, దేవిని ప్రసన్నం చేసుకునేందుకు 25 ఏం డ్లు తపస్సు చేశారు. అమ్మవారు దర్శనమిచ్చి భక్తులను భక్తి, సన్మార్గంలో నడిపించాలని సూచించా రు. ఆ తరువాత 17వ శతాబ్ధంలో తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో భక్తులకు జ్ఞానబోధన చేశారు. అనంత రం ప్రభువు ఆలయంలో చేరి జీవసమాధి అయ్యారట. అప్పటి నుంచి ప్రతి ఏటా స్వామి జన్మదినమైన చైత్రశుద్ధ పౌర్ణమిన జాతర ఉత్సవాలు కొనసా గించడం ఆనవాయితీ.
ఉత్సవాల వివరాలు..
ఏప్రిల్ 15న ధ్వజారోహణం (అర్ధాస్), జెండా సమర్పణతో జాతర ప్రారంభమవుతుంది. అదే రో జు రాత్రికి బంజారా భజనలు, 16న ఉదయం 10 గంటలకు ప్రభువు, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూ జలు, 17న తెల్లవారుజామున గ్రామంలోని హన్మా న్ దేవాలయం వరకు రథోత్సవం నిర్వహిస్తారు. ఉ దయం 6 గంటల నుంచి పప్పు, అన్నం, జీలకర్ర, ఎల్లిపాయ, పసుపుతో చేసిన నైవేద్యం సమర్పిస్తారు. 8 గంటలకు పల్లకీసేవ, ప్రభువు, గుర్రం పా దాల సంప్రోక్షణ అనంతరం నందిగామలోని లక్ష్మ మ్మ మాసంత్ దేవాలయ ప్రవేశానంతరం ప్రభువు ప్రధాన ఆలయానికి చేరుకొని జీవసమాధిపై యథావిధిగా పాదాలను చేర్చి ప్రత్యేక పూజలు చేస్తారు. 18న ఉదయం కాళికాదేవి పల్లకీసేవ అనంతరం బావాజీ ప్రధాన దేవాలయానికి చేరుకుంటారు. అ దే రోజు మధ్యాహ్నం అమ్మవారికి జీవాలను బలి చ్చి ఎడమకాలి సప్ప, ఏడు మూలుగ బొక్కలు, స గం కార్జం, దొబ్బ, బోటి, పేగులు, బెల్లం బువ్వతో నైవేద్యం సమర్పిస్తారు. జాతరలో భక్తులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.