ఊట్కూర్, ఏప్రిల్ 14 : రైతాంగానికి అండగా నిలుస్తు న్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోన్రెడ్డి అన్నారు. మండలంలోని అమీన్పూర్లో రైతు వేదిక ప్రారంభోత్సవానికి గురువారం హాజరైన ఎమ్మెల్యేను రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ రాంరెడ్డి ఆధ్వర్యంలో రైతులు డప్పులతో ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదిక భవనానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. దేశ చరిత్రలో రైతు సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం చేపట్టని వి ధంగా ప్రభుత్వం రైతాంగానికి వివిధ పథకాలను అమలు చేస్త్తుందన్నారు. రైతులకు డిజిటల్ ఎడ్యుకేషన్‌తో పంట సా గు, వ్యవసాయభివృద్ధిపై శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదిక భవనాల నిర్మాణం చేపట్టిందన్నారు. గ్రామానికి రూ.90 లక్షలతో బీటీ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు వివరించారు. రూ.50 లక్షలు జీపీ నిధుల తో ప్రతి వార్డులో సైడు కాల్వల నిర్మాణం చేపట్టేందుకు ప నులను ప్రారంభించాలని కార్యదర్శిని ఆదేశించారు. చాకలి జములప్ప దొడ్డి నుంచి వీరభద్రప్ప గిర్ని వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజలు చేసి ప్రారంభించారు.
మత విద్వేషాలు సృష్టించడమే బీజేపీ లక్ష్యం
అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్ల బీజేపీ పాలనలో ప్రజలను రెచ్చగొట్టి మత విద్వేషాలు సృష్టించడమే ఆ పార్టీ నా యకులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. అలాంటి నాయకులు గ్రామాల్లోకి వస్తే ఏం అభివృద్ధి చేశా రో.. నిలదీయాలని ప్రజలకు సూచించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను బీజేపీ నా యకులు విమర్శించేందుకు గ్రామాల్లోకి వస్తే రైతులు తరమి కొట్టాలని పిలుపునిచ్చారు.
పేదల జీవితాల్లో వెలుగులు
సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పేదలకు అందజేస్తున్న సహాయం వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని అమీన్‌పూ ర్, సామనూర్ గ్రామాల్లో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి స్వయంగా చెక్కుల పంపిణీ చేపట్టినట్లు వివరించారు. ఇప్ప టి వరకు 1300 మందికి చెక్కులను అందజేశామన్నారు. ఆడపడుచుల పెండ్లి తల్లిదండ్రులు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాన్ని కొందరు ఫోర్జరీ చేసి పక్కదారి పట్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
అలాంటి వారిపై జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మక్తల్ మార్కె ట్ చైర్మన్ రాజేశ్గౌ డ్, సర్పంచుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, తాసిల్దార్ తిరుపతయ్య, ఏవో గణేశ్‌రెడ్డి, సర్పంచ్ యశోదమ్మ, ఎంపీటీసీ అనిత, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, మాజీ విం డో చైర్మన్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ల క్ష్మారెడ్డి, నాయకులు తిరుపతిగౌడ్, రవీందర్‌రెడ్డి, శేఖర్‌రె డ్డి, భీంరెడ్డి, రాములు, రఘుపతిరెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠాపన
మండలంలోని గుడిగండ్ల ఆంజనేయస్వామి ఆలయంలో నవగ్రహాల విగ్రహాలు, బొ డ్రాయి ప్రతిష్ఠాపన, బీరప్ప ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మె ల్యే చిట్టెం, డీసీసీబీ బ్యాంకు చైర్మన్ చిట్యాల నిజాంపాషా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో బొ డ్రాయి, నాగదేవతలు, నవగ్రహాల విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడంపై గ్రామానికి మేలు జరుగాలని, ప్రజలందరూ సు:ఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తు లు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆలయానికి రూ.60లు ఆర్థిక సాయం
ఆంజనేయస్వామి ఆలయానికి ఎంపీటీసీ లక్ష్మీనర్సిరెడ్డి దంపతులు రూ.60 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎమ్మెల్యే నుంచి ఆలయ కమిటీ సభ్యులకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరి, ఉపస ర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, రేషన్ డీలర్ చంద్రశేఖర్, నాయకులు తిరుపత్య, కుర్మయ్య, కిష్టప్ప, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గన్నారు.