మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 14 : దళితజాతి అభివృద్ధే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న ట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. దళితబంధుతో దళితుల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు వచ్చాయన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బీఆర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న ట్లు తెలిపారు. దళితబంధు లబ్ధిదారులకు 11 ట్రాక్టర్లు, 2 గూడ్స్ వాహనాలను మంత్రి పంపిణీ చేశారు. అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతున్నాయని చెప్పారు. అయినా ఇంకా అక్కడక్కడ అంటరానితనం, అస్పృశ్యత, వివక్ష కొనసాగుతున్నదని, అసమానతలను రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. చదువే అభివృద్ధికి మూలమని అం బేద్కర్ పేర్కొన్నారని… ఆర్థికంగా ఎదిగేందుకు కచ్చితంగా చదువు ఉపయోగపడుతుందని తెలిపారు.
దళితబంధు పథకాన్ని కచ్చితంగా కొనసాగిస్తామని, మొ దటి విడుతలో నియోజకవర్గంలో 100 మందికి, త ర్వాత రెండో విడుతలో రెండు వేల మందికి, ఆ తర్వాత ప్రతి దళిత కుటుంబానికి అందేలా చేస్తామన్నారు. దళితులు ఆర్థికంగా బాగుపడే వరకు ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శా తం వారికి రావాల్సిన హక్కులను కల్పిస్తామన్నారు. దళితుల సమస్యలపై కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించాలని ఆదేశించారు. దళితుల కోసం భవిష్యత్తులో మరిన్ని పథకాలు తీసుకొస్తామన్నారు. దళితబంధు రెండో విడుతలో 2000 మంది జాబితాను వెంటనే తయారుచేసి సమర్పించాలని సూచించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో కూడా 70 శాతం దళితులకే కేటాయిస్తామన్నారు. కార్యక్రమం లో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ సీతారామారావు, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, సాంఘిక, సంక్షేమ శాఖ డీడీ యాదయ్య, ఎస్సీ సంఘాల ప్రతినిధులు ఉన్నారు.