బాలానగర్, ఏప్రిల్ 7 : ప్రభుత్వ ఉద్యోగ సాధనకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ప్రభుత్వం ఇచ్చే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అవగాహన కల్పించారు. 8 నుంచి 11వ తేదీవరకు యువతీ యువకులు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎం పీడీవో కృష్ణారావు, ఎంపీవో శ్రీదేవి, డిప్యూటీ తాసిల్దార్ హనీఫ్ఖాన్, ఆర్ఐ వెంకట్రాములు తదితరులు ఉన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, ఏప్రిల్ 7 : ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులు ఉ చి త కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని తా సిల్దార్ ఆంజనేయులు తెలిపారు. తాసిల్దార్ కార్యాలయం లో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్‌పై అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, ఏప్రిల్ 7 : ప్రభుత్వ ఉద్యోగ సాధనకు ఎస్సీ, ఎస్టీ యువత ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని తాసిల్దార్ జ్యోతి తెలిపారు. మండలకేంద్రంలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచిత కోచింగ్‌పై అవగాహన కల్పించారు. గ్రూప్స్, ఎస్సై, టెట్, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 7 : నిరుద్యోగులు ఉచి త శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ కిషన్ సూచించారు. అడ్డాకుల తాసిల్దార్ కార్యాలయంలో గురువారం ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు తె లిపారు. అర్హులైన యువతీ యువకులు 11వ తే దీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, ఎంపీడీవో మంజుల తదితరులు పా ల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ యువతకు మంచి అవకాశం
మూసాపేట, ఏప్రిల్ 7 : ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని తాసిల్దార్ మంజుల అన్నారు. గురువారం తాసిల్దార్ కార్యాలయంలో అవగాహన కల్పించారు. గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై నరేశ్, ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ వరప్రసాద్, ఆర్ఐ మ మత తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, ఏప్రిల్ 7 : ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షల కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ యువత ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని తాసిల్దార్ చెన్నకిష్టన్న తెలిపారు. ము న్సిపాలిటీలోని ఫంక్షన్ హాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉచిత శిక్షణకు అర్హులైన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో ఎంఈవో నాగయ్య, డిప్యూటీ తాసిల్దా ర్ రాజీవ్‌రెడ్డి, జీహెచ్ఎం కవిత, అధ్యాపకుడు బాలలింగమయ్య, దళిత సంఘాల నాయకులు రామునాయక్, బో రింగ్ నర్సింహులు, గడ్డం రాములు, బాలరాజు తదితరు లు పాల్గొన్నారు.
అధికారుల సమాచార లోపం
మిడ్జిల్, ఏప్రిల్ 7 : అధికారుల సమాచార లోపంతో ఉచిత శిక్షణ అవగాహన సదస్సుకు అభ్యర్థులు సద్వినియో గం చేసుకోలేకపోయారు. గురువారం మండలకేంద్రంలో ని మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఆధ్వర్యం లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అవగాహన సద స్సు నిర్వహించారు. మండలంలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు అధికారులు పూర్తిస్థాయిలో సమాచారమివ్వకపొవడంతో అభ్యర్థులు పాల్గొనలేదు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం వల్ల ఐదు మంది అభ్యర్థులు పాల్గొన్నారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన రై తులను సమావేశంలో కూర్చోబెట్టి మమ అనిపించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ గీత, ఎంపీవో అనురాధ పాల్గొన్నారు.