మక్తల్ రూరల్, మార్చి 22 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం మహిళలకు వరమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మహాద్వార్, సో మేశ్వర బండ, లింగంపల్లి, ఉప్పర్‌పల్లి తదిత గ్రామాల్లో ల బ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి పథకం చెక్కులను మంగళవారం ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. గర్భిణులు సర్కారు ద వాఖానల్లో కాన్పులు చేసుకున్న ప్రతి మహిళాకూ కేసీఆర్ కిట్‌తోపాటు రూ.12వేలు ఇవ్వడం జరుగతుందన్నారు. మండలంలోని మహాద్వార్లో 5 మంది, ఉప్పర్‌పల్లిలో 5 మంది, లింగంపల్లిలో 7 మంది, సోమేశ్వరబండ గ్రామం లో 5 లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఎమ్మెల్యే చెక్కులను అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సర్పంచులు లక్ష్మి, సుజాత, సా విత్రి, వెంకటరాములు, ఎంపీటీసీ రాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వన జాగౌడ్ అన్నారు. మండలంలోని ఎడవెల్లి లో సీసీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామా ల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు ప్ర భుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే ప్రతి జీపీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టినట్లు వివరించా రు. ఎమ్మెల్యే నిధులు, ప్రభుత్వ నిధులతో నియోజవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలోకి తెస్తామన్నా రు. గ్రామాల్లో విద్యుత్, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, ఎంపీటీసీ జయమ్మ, మాజీ ఎంపీపీ వెంకట్రామారెడ్డి, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు రాజేశ్, రాజశేఖర్‌రెడ్డి, దేవన్న పాల్గొన్నారు.