కొల్లాపూర్, మార్చి 22 : మండలంలోని ఎల్లూరు రిజర్వాయర్ వద్ద మొద లై చేపల పంచాయితీ పోలీసుల జోక్యం తో సద్దుమణిగింది. చేపలు పట్టే విషయంలో భూ నిర్వాసితులు, మత్స్యకారుల మధ్య తోపులాట చోటుచేసుకున్న ది. రిజర్వాయర్‌లో చేపలు పట్టే హక్కు తమకే ఉందంటూ ఇరువర్గాలు వాగ్వాదానికి దిగి తోపులాట జరిగింది. వివరా లు ఇలా ఉన్నాయి. ఎల్లూరులో నోటిఫైడ్‌గా పేరున్న నల్లచెరువు కింద (రిజర్వాయర్ కంటే ముందు) 100 ఎకరాల ఆ యకట్టుకు సాగునీరు అందేది. అయితే ఎంజీకేఎల్ఐ పథకంలో ఈ చెరువు 2012 సెప్టెంబర్ 16న రిజర్వాయర్‌గా మారింది. ఈ క్రమంలో ఎల్లూరు, చెం చుగూడెం, బోడబండతండా గ్రామాల కు చెందిన రైతులకు సంబంధించి 680 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. నాటి నుంచి ఎల్లూరు మత్స్యకార సం ఘం సభ్యులే చేపలు పట్టేవారు. అయితే 2013 జీవో ప్రకారం భూనిర్వాసితులు కూడా రిజర్వాయర్‌లో చేపల వేట కొనసాగించవచ్చని చట్టంలో హక్కు ఉన్నదని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కోర్టు నుంచి నోటీసులు జా రీ చేసినా మత్స్య సహకార సంఘం స భ్యులు స్పందించలేదని తెలిసింది. దీం తో చేసేది లేక మూడు గ్రామాలకు చెంది న భూనిర్వాసితులు రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు మంగళవారం మూ కుమ్మడిగా ట్రాక్టర్లలో పుట్టీలతో సహా చే రుకున్నారు. ఈ సమాచారం అందుకు న్న మత్స్యకారులు సైతం రిజర్వాయర్ వద్దకు వచ్చి చేపల వేటకు వచ్చిన నిర్వాసితులను ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకు న్నది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పారు. దీంతో ఇరువర్గాలు శాంతించడంతో వివాదం తాత్కాలికంగా ముగిసింది.