కోస్గి, మార్చి 22 : అభివృద్ధే ఎజెండాగా అడుగులు వేస్తున్నట్లు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముం దుంచేందుకు కృషి చేస్తామన్నారు. మం గళవారం మండలంలోని కడంపల్లి గ్రా మంలో రూ.76 లక్షలతో పీఏసీసీఎస్ గోదాం ఏర్పాటుకు డీసీసీబీ చైర్మన్ ని జాంపాషాతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం సర్జఖాన్‌పేట, చెన్నారం గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ కొడంగల్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు ఆ శ్చర్యపోతున్నారని వివరించారు. మూ డున్నరేండ్లలో ప్రతి గ్రామం, తండాకు రోడ్డు వేయించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదే అన్నారు. అభివృద్ధి కోసం మంత్రులతో కలిసి అహర్నిశలు కృషి చేస్తూ నిధులు మంజూరు చేయిస్తున్నట్లు చెప్పారు.
కోస్గికి పీఏసీసీఎస్ గోదాం
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహకారంతో కోస్గికి రూ.76 లక్షలతో పీఏసీసీఎస్ గోదాం మంజూరైందని డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా తెలిపారు. అభివృద్ధి కోసం వెంపర్లాడుతూ నిధులు తీసుకొ చ్చే నేత, ఎమ్మెల్యేగా నరేందర్‌రెడ్డి ఉండ డం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు.
టీఆర్ఎస్లోకి పలువురు..
మీర్జాపూర్ గ్రామంలో రాజేందర్‌రె డ్డి, హన్మంత్ నాయక్ ఆధ్వర్యంలో సు మారు 100 మంది కాంగ్రెస్ నాయకు లు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. కార్యక్రమా ల్లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ భీంరెడ్డి, పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్, ఎంపీపీ మధుకర్‌రావు, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.