మహబూబ్‌నగర్ టౌన్, మార్చి 21 : ప్రతిఒక్కరూ కరోనా టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని యూనిసెఫ్ సభ్యుడు డా. సుబ్రహ్మణ్యం కోరారు. సోమవారం షాషాబ్గుట్టలోని దారుల్ ఉలుమ్ అరబియా మదర్సా రాబియా బస్రీ హాల్లో యూనిసెఫ్, మను సంయుక్తంగా 12 నుంచి 14 ఏండ్ల బాలబాలికల కు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డా క్టర్ సయ్యద్ అబ్దుల్అలీమ్, నదర్బేగ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్‌ఇసాక్, యూనిసెఫ్, మను జిల్లా కో ఆర్డినేటర్ మౌలానా ఖాజాఫైజుద్దీన్, హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మహమూద్‌అలీ, బషీర్‌అహ్మద్, సయ్యద్, అప్రోజ్షా, సయ్యద్ సుల్తాన్, తాహెర్బిన్అహ్మద్, మినాహజుద్దీన్, నజీమఫాతిమా, హుస్నాఫాతిమా, రైస్సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
చురుగ్గా వ్యాక్సినేషన్..
మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 12 నుంచి 14 ఏండ్లలోపు విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాతున్నది. బడి బయట ఉన్న చిన్నారులకు కూడా టీకా వేస్తున్నారు. మండలంలో సోమవారం వర కు 997 మందికి టీకా వేసినట్లు మండల వైద్యాధికారి సృజన తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాములు, కళమ్మ, శకుంతల, శ్రీనివాస్, రాఘవేందర్, అవినాష్ పాల్గొన్నారు.