ఊట్కూర్, మార్చి 21 : మండల సరిహదులో గల ఇ డ్లూరు శంకరలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పం డువగా కొనసాగుతున్నాయి. శంకరలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము న అగ్ని గుండం, ప్రత్యేక భజనలు, డోలారోహణం, స్వామివారి ప్రభాతోత్సవం (చిన్నతేరు) ఊరేగింపు నిర్వహించా రు. మంగళవారం సాయంత్రం జరిగే శంకరలింగేశ్వరస్వా మి రథోత్సవ వేడుకలకు భక్తులు అధికసంఖ్యలో హాజరు కావాలని జాతర నిర్వాహకులు కోరారు. జాతరలో గాజు లు, ఆట వస్తువులు, బొమ్మలు, మిఠాయి దుకాణాలను వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నారు.
కనుల పండువగా రథోత్సవం
మండలంలోని నేరడగం ప చ్చిమద్రి సంస్థాన విరక్తమఠం పంచమ సిద్ధలింగేశ్వరస్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా మహా రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. పంచమ సి ద్ధలింగ మహా స్వాముల ఆధ్వర్యంలో కుమారేశ్వర నూతన దాసోహ మండపానికి ఓళాబళ్లారి సువర్ణగిరి విరక్తమఠం పిఠాధిపతి భూమి పూజ నిర్వహించారు. అనంతరం సిద్ధలింగేశ్వరస్వామి కాన్సెప్ట్ పాఠశాల నూతన భవనాన్ని ప్రా రంభించారు. బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి, మాజీ మంత్రి డీకే అ రుణ, కొండయ్య సిద్ధలింగ మహాస్వామిని శాలువాతో ఘనంగా సన్మానించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మఠాధిపతులకు ప్రత్యేక పూజాలు చేసి సిద్ధలింగ మహాస్వాముల ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి రథంపై ఉంచి ముందుకు లాగారు. కా ర్యక్రమానికి భక్తులు, ప్రజాప్రతినిధులు, అ ధికారులు నాయకులు పాల్గొన్నారు.