మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మార్చి 21 : రాష్ట్ర ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో అడవుల శా తం పెరిగిందని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. ప్రపంచ అటవీ ది నోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మొక్కలు, వాటి ప్రాముఖ్యత గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు అడవుల ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎనిమిదేండ్లలో 5 నుంచి 8 కోట్ల మొక్కలు నాటామని, అందులో 5 కోట్ల మొక్కలను సంరక్షించామన్నారు. వీటితోపాటు రెండేండ్లలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా మూడు కోట్ల విత్తన బంతులను ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టల ప్రాంతాల్లో వెదజల్లామన్నారు. ఇందుకుగానూ జిల్లాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రి కార్డు వచ్చిందని, ఇదంతా మహిళా సంఘాల కృషి అని అన్నారు. ఈ ఏడాది జిల్లాలోని ప్రతి విద్యార్థి విత్తన బంతులు తయారుచేయించి, గ్రామాల్లో చల్లాలని సూచించారు. విత్తన బంతుల తయారీకి అన్ని మండల్లాలో రీసోర్స్ పర్సన్లను ఏర్పాటు చేసి జూ న్లో శిక్షణ ఇస్తామని, జూలైలో వెదజల్లేలా చర్యలు తీసుకోవాల ని డీఎఫ్‌వో గంగారెడ్డిని ఆదేశించారు. విద్యార్థులు మొక్కలు నా టి సంరక్షించాలన్నారు. అనంతరం కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులతో మొక్క నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరా జ్ తదితరులు పాల్గొన్నారు.