కృష్ణ, మార్చి 21 : మహిళలకు చట్టాలపై కనీసం అవగాహన ఉండాలని, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాల బాలికలకు సైబర్ నేరాలపై అవగాహన ఉండాల్సి అవసరం ఉ న్నదని ఎస్సై విజయ్‌భాస్కర్ అన్నారు. మండలంలోని గు డెబల్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాల పై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్ర జలందరూ అవగాహన కలిగి ఉండాలని, పిల్లలు మొబైల్ ఫోన్లు వినియోగించడంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని తెలియజేయాలని పేర్కొన్నారు. నేటి సమాజంలో ఇంటర్నెట్లో జరుగుతున్న మోసాలు, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలని అవగాహన కల్పించామన్నారు. ఫేస్బుక్, వాట్సప్‌ల్లో గుర్తుతెలియని వారితో పరిచయం వంటి విష యాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జీవితాలను నాశనం చేసుకోవద్దు
మద్యపానం, గుడుంబావంటి మత్తుపదార్థాలకు అలవాటుపడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్ ఎస్సై వెన్నెల అన్నారు. సోమవారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు మద్యపానంపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశలో మద్యం, గంజాయి, సిగరెట్ వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాలు తీసుకొని పోలీసులకు పట్టుబడి కేసులు నమోదైతే ము న్ముందు అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. చదువుకొని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. కా ర్యక్రమంలో దామరిగిద్ద ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక సివిల్ ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.