నర్వ, మార్చి 21 : ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ విద్యా బోధన ను ప్రవేశపెడుతుందని ఎంఈవో లక్ష్మీనారాయణ అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవా రం సమావేశం నిర్వహించారు. సమావేశానికి మండలం నుంచి 25 మంది ఉపాధ్యాయులను మొదటి విడుత శిక్షణకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 21 నుం చి 26వ తేదీ వరకు నిర్వహించే శిక్షణ తరగతులకు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రారంభమైన శిక్షణ తరగతులు
జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో ఆం గ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు ఎంపి క చేయబడిన ఉపాధ్యాయులకు శిక్షణ తరగతుల కార్యక్రమం ప్రారంభించారు. ధన్వా డ, మరికల్ మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు ధన్వాడలో, కృష్ణ, మాగనూర్ మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు మాగనూర్లో శిక్షణ నిర్వహించారు. మొ త్తం 364 మంది ఉపాధ్యాయులకు గానూ 321 మంది ఉ పాధ్యాయులు మొదటి రోజూ శిక్షణకు హాజరయ్యారు. వా రికి ఆర్పీలు శిక్షణ ఇచ్చారు. ఇంకా నాలుగు రోజులపాటు శిక్షణ కొనసాగనున్నది.
ఆంగ్ల బోధనకు అడుగులు
మండలంలో ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రైవేట్ బడులకు దీటుగా ఆంగ్ల బోధన అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింద ని డీఈవో లియాఖత్ అలీ అన్నారు. అందు లో భాగంగానే మాగనూర్, కృష్ణ మండలా లకు చెందిన కొంత మంది ఉపాధ్యాయుల కు ఈఎల్ఈసీ కార్యక్రమాన్ని కోర్స్ డైరెక్టర్ రాజేశ్వర్ చేపట్టారు. కార్యక్రమాన్ని మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి లి యాఖత్ అలీ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా లియాఖత్ అలీ మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్స రానికి గానూ ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని ప్ర భుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఉపాధ్యాయులకు ఆంగ్లంపై దశల వారీగా శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంఈవో లక్ష్మీనారాయణ, ఆర్పీలు, ఉపాధ్యాయు లు తదితరులు పాల్గొన్నారు.