ఊట్కూర్, ఫిబ్రవరి 22 : మండలకేంద్రంలో మంగళవారం గ్రామ దేవత ఊర లక్ష్మమ్మ బోనాల ఉత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. గ్రామ దేవతను దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉద యం 5 గంటలకు జల్దిబిందె సేవ, 10 గంటలకు బోయిని అమ్మన్న ఇంటి నుంచి పెద్ద బోనం కుండను ఊరేగించారు. ఊరేగింపులో మహిళలు బోనాలతో పాల్గొన్నారు. యువకులు డప్పుచప్పుళ్ల మధ్య కేరింతలు కొడుతూ.. నృత్యంతో ఆకట్టుకున్నారు. పలువురు మహిళలు పూనకాలతో పరవశించిపోయారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశా రు. జాతరలో చిరు వ్యాపారులు తిను బండారాలు, ఆట బొమ్మలు, మిఠాయి, శీతల పానీయం దుకాణాలను ఏర్పా టు చేసుకున్నారు. కార్యమ్రంలో ఎంపీపీ లక్ష్మి, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, జాతర ని ర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మన్న, ముద్దం రాము, నారాయణ, శేషప్ప, భరత్‌కుమార్, రమేశ్, కొండర్ గోపాల్, రఘువీర్, వసంత్‌కుమార్, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని వ సతులను కల్పించారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయం
పట్టణంలోని సిం గార్భేస్ ఎల్లమ్మ అమ్మవారి ఉత్సవాలు మంగళవారం ఘ నంగా జరిగాయి. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ని ర్వాహకలు ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పసుపు, కుంకుమతో అర్చన చేసి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పచ్చిపులుసు, అ న్నం నైవేద్యంగా సమర్పించడంతోపాటు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు తమ కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకొని తమను సల్లంగా చూడు తల్లీ అని వేడుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు
మండ లకేంద్రంలో కట్టమీది ఎల్లమ్మ జాతర ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కన గ్రామాల భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో మద్దెలబీడ్, ఉడ్మల్గిద్ద, బా పన్పల్లి, సజనాపూర్ తదితర గ్రామస్తు లు పాల్గొన్నారు.
ఘనంగా బండారు ఉత్సవాలు
మండలంలోని జాజాపూర్ బీరలింగేశ్వరస్వామి బండారు ఉత్సవాల్లో భా గంగా మంగళవారం ఎల్లమ్మ బండారు ఉత్సవాలు ఘనం గా జరిగాయి. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజ లు, పసుపు, కుంకుమతో అర్చన చేసి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పచ్చిపులుసు, అన్నం నైవేద్యంగా సమర్పించడంతోపాటు మొక్కులు చెల్లించుకున్నారు. ఒకరిపై ఒకరు పసుపు చల్లుకున్నారు. గ్రామస్తులతోపాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధికసంఖ్యలో ఉత్సవాలకు హాజరయ్యారు.
ఎల్లమ్మను దర్శించుకొన్న భక్తులు
మండలంలోని లింగంపల్లి ఎల్లమ్మ దేవతను మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వివిధ గ్రా మాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు బోనం కుండల్లో నైవెద్యం వండి అమ్మవారికి సమర్పించారు. కా ర్యక్రమంలో గ్రామస్తులతోపాటు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.