మహబూబ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 22 : మహబూబ్‌నగర్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. పాలమూరు మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను తీర్చడంపై మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో కు టుంబ పెద్ద పాత్ర పోషించి ప్రజల సమస్యలు తీర్చడం పై దృష్టి సారించాలన్నారు. పన్నుల వసూలు, హరితహారం మొక్కల సంరక్షణ, ఆక్రమణలను అరికట్టడం, అభివృద్ధి కార్యక్రమాల కోసం కృషి చేయాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా, వేగంగా అభివృద్ధి చెందుతు న్న పట్టణాల్లో మహబూబ్‌నగర్ చేరుతుందని చెప్పారు. త్వరలోనే మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌గా ఏర్పా టు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. జి ల్లాలో బస్టాండ్, ప్రభు త్వ, ఎస్వీఎస్ దవాఖా న, కేసీఆర్ ఎకో అర్బన్ పార్కుల వద్ద రూ.18 కోట్లతో ఐదు ఫుట్ ఓవ ర్ బ్రిడ్జీలను నిర్మించనున్నట్లు తెలిపారు.
మార్చి తర్వాత మహబూబ్‌నగ ర్ మున్సిపాలిటీకి 2 వేల నుంచి 3 వేల వరకు డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఆయా వార్డుల్లోని కౌన్సిలర్లు పేదలను ముందే గుర్తించి జాబితను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మినీ ట్యాంక్‌బండ్ వద్ద నెక్లెస్ రోడ్డు నిర్మాణానికి రూ.24 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే ఇందుకు సంబంధించి జీవో తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఉదండాపూర్, కరివెన రిజర్యాయర్లు పూ ర్తయితే సాగునీటి సమస్య, పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదన్నారు. రూ.20 కోట్లతో క్రీడల అభివృద్ధి చేస్తున్నామని, రూ.9 కోట్లతో ఇండోర్ స్టేడియాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే వాలీబాల్ అకాడమీ మంజూరు, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు ఆడేలా స్టేడియం పనులు జరుగుతున్నాయని, సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నారు. ఎంవీఎస్ కళాశాల వద్ద స్టేడియం మంజూరు చేశామన్నారు.
మన్యకొండ వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రం ఏ ర్పాటైన కొత్తలో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే పరిస్థితి మన రాష్ర్టానికి ఉండేదని, ఇప్పుడు ప్రతి ఏడాది రూ.55 నుంచి రూ.60 వేల కోట్లు కేంద్రానికి ఇస్తున్నామని వివరించారు. దేశంలో వరి పండించడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. మార్చి తర్వాత భూ త్పూర్-చించోలి రహదారి పనులకు టెండర్లు పిలువనున్నట్లు చెప్పారు. కౌన్సిలర్లు, అధికారులు బాధ్యతగా పనిచేయాలని, మున్సిపాలిటీలో ఎక్కడైనా ఆక్రమణలను చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏసీ టౌన్ హాల్, కళావేదికలు నాలుగు నెలల్లో పూర్తి చే యాలని అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌కు సూచించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ నర్సింహు లు మాట్లాడూతూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో మహబూబ్‌నగర్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ‘ముడా’ సాధించినందుకు మంత్రికి ఘన స్వాగతం పలికి మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, కౌన్సిల్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.