కల్వకుర్తి, ఫిబ్రవరి 21 : ఆశవర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో కల్వకుర్తి, వెల్దండ, తోటపల్లి రఘుపతిపేట పరిధిలో పనిచేసే ఆశ వర్కర్లకు ప్రభుత్వం సమకూర్చిన స్మార్ట్ ఫోన్లను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వేళ ఆశ కార్యకర్తలు చేసిన సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఆశలకు స్మార్ట్ ఫోన్లో ఇస్తున్నారని, గ్రామాల్లో బాలింతలు, గర్భిణులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. అంతకు ముందు ఆశ వర్కర్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను సత్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ విజితారెడ్డి, ఎంపీపీ సునీత, ఏఎంసీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్‌గౌడ్, డాక్టర్ బాబర్ , టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదలకు వరం సీఎం సహాయనిధి
సీఎం సహాయనిధి పేదలకు వరమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ బలరాంనగర్ కాలనీకి చెందిన మహ్మద్ రూ.1.25లక్షలు, మండలంలోని ఎలికట్ట గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు రూ.34వేలు, వెంకటమ్మకు రూ.13వేలు, కృష్ణయ్యకు రూ.19వేలు, రామదాసుకు రూ.36వేలు, యాదయ్యకు రూ.40వేలు, రఘుపతిపేట గ్రామానికి చెం దిన పార్వతమ్మకు రూ.14వేలు, కుర్మిద్ద గ్రామానికి చెందిన మణెమ్మకు రూ.22 వేలు విలువ గల చెక్కులు సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యాయి. ఈ చెక్కులను సోమవారం ఎమ్మెల్యే కల్వకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేశారు.
కలిసికట్టుగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందాం
కల్వకుర్తి మున్సిపాలిటీని కలిసికట్టుగా అభివృద్ధి చే సుకుందామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం కల్వకుర్తి మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్మన్ ఎడ్మసత్యం ఆధ్యక్షతన కల్వకుర్తి మున్సిపాలిటీ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గత మూడు నెలలుగా మున్సిపాలిటీలో నిర్వహించిన అభివృద్ధి ప నులపై చర్చించారు. తీర్మానాలను ఆమో దించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడారు. అన్ని వార్డుల అభివృద్ధికి శాయ శక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కోర్టు ఏర్పాటు చేయాలని వినతి
ఆమనగల్లులో కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ కల్వకుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు చెందిన కోర్టు కేసులు ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ కోర్టులకు బదిలీ అవుతాయని, దీంతో కక్షిదారులకు, న్యాయవాదులకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆమనగల్లులో నూతనంగా కోర్టు ఏర్పాటు చేయాలని వారు వినతిపత్రంలో వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌గౌడ్, ఉపాధ్యక్షుడు జ మీల్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సీనియర్ న్యాయవాది లక్ష్మణశర్మ, న్యాయవాదులు కృష్ణయ్య, లక్ష్మీనారాయ ణ, రాంగోపాల్, ఆంజనేయులు, భాస్కర్‌రెడ్డి, జయంత్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం
ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సూచించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడిపై సమీక్ష నిర్వహించారు. సమీక్షకు నియోజకవర్గంలోని ఎం ఈవోలు, ఎంపీడీవోలు, ఎంపీపీ, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో మండలాల్లోని అధికారులు బడులు స్థితిగతులను వివరించారు.