భూత్పూర్, ఫిబ్రవరి21: సీఎం కేసీఆర్ కృషితోనే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అ న్నారు. సోమవారం మండలంలోని పోతులమడుగు పరిధిలోని ముత్యాలంపల్లిలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రూ.2కోట్లతో వంతెన పనులను ప్రారంభించారు. అనంతరం భూత్పూర్ మున్సిపాలిటీలో రైతువేదికను ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల కోసం రైతువేదికలను నిర్మించినట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తిచేసి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. రూ.2500కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆశవర్కర్లకు స్మార్ట్ఫోన్లను అందజేసి మాట్లాడారు. కరోనా సమయంలో వైద్యసిబ్బందితో కలిసి ఆశవర్కర్లు పనిచేశారన్నారు. అదేవిధంగా 20మందికి కల్యాణలక్ష్మి, ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మున్సిపాలిటీలోని గోప్లాపూర్, అమిస్తాపూర్, రాందాస్తండాల్లో సీసీరోడ్లను ప్రారంభించారు. సిద్దాయపల్లిలో నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. సంబంధిత అధికారులను తాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. మార్చి మొదటివారంలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ రానున్నట్లు తెలిపారు. అప్పటివరకు డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, వైస్‌చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, డీఎంహెచ్‌వో కృష్ణ, ఏడీఏ యశ్వంత్‌రావు, డీఎంవో విజయ్‌కుమార్, పీవో డాక్టర్ సంధ్యాకిరణ్మయి, తాసిల్దార్ చెన్నకిష్టన్న, కమిషనర్ నూరుల్‌నజీబ్, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, బాలకోటి, కృష్ణవేణి, తైసీన్బేగం, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు తిరుపతయ్యగౌడ్, వీరాంజనేయులు, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.