రాజాపూర్, ఫిబ్రవరి 17 : తెలంగాణ అభివృద్ధిప్రదాత సీఎం కేసీఆర్ అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం కుచ్చర్కల్లో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే రైతులను సన్మానించి మొ క్కలను నాటారు. అనంతరం రూ.20లక్షల తో పంచాయతీ భవనం, రూ.12లక్షలతో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ భవనాలు, రూ.5ల క్షలతో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే రూ.24లక్షలతో అం డర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.15లక్షలతో సీసీరో డ్డు, రూ.3లక్షలతో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ పనులతోపాటు, రూ.12లక్షల 60వేలతో ని ర్మించిన వైకుంఠధామం, రూ.2లక్షల 48వేలతో డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతి వనం, నర్సరీలను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో గ్రామాల్లో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జాతీయ రాజకీయ పార్టీలు రాష్ర్టానికి చేసిందేమీలేదన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ యా దయ్య, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబంధు సమి తి అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సం ఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, సర్పంచ్ సుధారాణి, ఆనంద్‌గౌడ్, తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, నాయకులు మహిపాల్‌రెడ్డి, యాదగిరి, విజయ్, దేవేందర్, సత్యయ్య, వెంకట్రాంరెడ్డి, వెంకటయ్యగౌడ్, కృష్ణయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.
కేసీఆర్‌వైపు దేశం చూపు
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశమంతా సీఎం కేసీఆర్‌వైపు చూస్తున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జడ్చర్లలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ఎ మ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్ర తిఒక్కరూ సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నిరంగాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులు పోటీ పరీక్షల్లో రా ణించేలా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇం గ్లిష్ విద్యను అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సంగీత,నాటక అకాడమీ మా జీ చైర్మన్ బాద్మి శివకుమార్, మున్సిపల్ చై ర్‌పర్సన్ దోరేపల్లి లక్ష్మి, మార్కెట్ కమిటీ చై ర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు కాట్రపల్లి లక్ష్మయ్య, పీ.మురళి, మున్సిపల్ వైస్‌చైర్మన్ సారిక, ఎంఈవో మంజులాదేవి, మున్సిపల్ కమిషనర్ సునీత, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అప్పీయచిన్నమ్మ, ఇన్చార్జి ఎం పీడీవో జగదీశ్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్ ఉన్నారు.
సేవాలాల్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఆధ్యాత్మిక గురు వు సంత్ సేవాలాల్ మహరాజ్‌ను గిరిజను లు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని మండలకేంద్రంలో నిర్వహించిన వేడుకలకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చాకే సేవాలాల్ జ యంతికి గుర్తింపు వచ్చిందన్నారు. ఉగాది తర్వాత సొంతజాగ ఉన్న పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. సేవాలాల్ ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, జె డ్పీటీసీ శశిరేఖ, తాసిల్దార్ శ్రీనివాసులు, స ర్పంచులు రాధికారెడ్డి, మేఘానాయక్, ఎం పీటీసీ సుదర్శన్, జైపాల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బాలు, వెంకట్‌రెడ్డి, దానియేలు, రామ్మోహ న్, లక్ష్మణ్‌నాయక్, తిరుపతినాయక్, విజయ్‌నాయక్, రమేశ్‌నాయక్ పాల్గొన్నారు.