ఊట్కూర్, ఫిబ్రవరి 10 : పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పులిమామిడి గ్రామాని కి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వా రా మంజూరైన చెక్కులను గురువారం మక్తల్ పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని పే ర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దే శంలో మరెక్కడ కూడా అమలు కావడంలేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూశాక కేంద్రానికి భ యం పట్టుకుందన్నారు. ఇప్పటికైనా కేంద్రం కండ్లు తెరిచి రాష్ర్టానికి అందాల్సిన నిధులను అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అ శోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఎల్లాగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు శ్రీనివాసులు, వెంకట్రామారెడ్డి, సమరసింహారెడ్డి, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరప్రసాదమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన శిరీషకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ.20వేల చె క్కును గురువారం బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు.పేదల వైద్యం కోసం ఎన్ని లక్షలైన వెచ్చిస్తుందన్నారు. కార్యక్రమంలో గుడిగండ్ల ఎంపీటీసీ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.