మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : కాంగ్రెస్ పాలనలో చిన్న డబ్బా ఇండ్లు ఇచ్చేవారని.., వాటి కోసం పేదలను అనేక తిప్పలు పెట్టేవారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పేదవాడి ఇల్లు ఆత్మగౌరవంతో ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. అం దుకే అన్ని హంగులతో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామంలో రూ. 2.10 కోట్లతో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇం డ్లు, రైతువేదికను మంత్రి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 65 ఏండ్లుగా అధికారం లో ఉన్న ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని.. సీఎం కేసీఆర్ ఏడేండ్లలో చేసి చూపించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.18 వేల కోట్లు ఖర్చు చేసి 2.70 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రా మ పంచాయతీల్లో నర్సరీ, ట్రాక్టర్, ట్యాంకర్లు ఉన్నాయ ని, చెట్లు స్వాగతం పలుకుతున్నాయని, మిషన్ భగీరథ తాగునీరు, టాయిలెట్లు, రైతుబంధు, రైతువేదిక వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా 24 గంటల ఉ చిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌తో రెండు లక్షల మంది జీవచ్ఛవాలు గా మారారని, మిషన్ భగీరథ నీటితో ఆ సమస్య పూర్తి గా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ప్రతి ఒక్కరికీ ఏదో ర కంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంట్లో ప్రస్తావించినట్లు చె ప్పారు. కొత్తగా పింఛన్లు సైతం ఇస్తామని వెల్లడించారు. కేంద్రం తెలంగాణను పూర్తిగా అన్యాయం చేస్తున్నదని.. వారు తమతో కలిసివచ్చినా.. రాకున్నా.. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శా ఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ ఎస్. వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ ప వార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ మమత, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్ చందర్ తదితరులు పాల్గొన్నారు.