మక్తల్ టౌన్, ఫిబ్రవరి 4: మనిషి జీవితం వెలకట్ట లేనిదని, దురలవాట్లను రూపుమాపాలని, డ్రగ్స్ రహిత రాష్ట్రమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మక్తల్ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్హాల్లో ఎస్సై రాములు ఆధ్వర్యంలో సీఐ సీతయ్య అధ్యక్షతన గంజా యి, గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ నిషేధం అవగాహన కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత దురలవాట్లకు బానిసలవుతున్నారని, గ్రామంలోని ప్రజాప్రతినిధులు యువత సరైన మార్గంలో వెళ్లేవిధంగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మక్తల్ నియోజకవర్గం కర్ణాటక బార్డర్లో కృష్ణ, ఊట్కూర్ ఉండ డం వల్ల ఆరాష్ట్రం కర్ణాటక గుట్కా వంటి వాటిని నిషేధించకపోవడంతో అక్కడినుంచి మక్తల్ నియోజకవర్గంలోకి రాకుండా చూడాలని తెలిపారు. అదేవిధంగా మట్కా వలన నియోజకవర్గంలో చాలా మంది జీవితాలు నాశనమయ్యాయని, మట్కా నడిపిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచులు వారి బాధ్యతను గుర్తుంచుకొని చెడు వ్యసనాలు నిషేధించే పనిచేయాలని సూచించారు.
డ్రగ్స్ రహిత రాష్ర్టానికి కృషి
సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి రాష్ర్టాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేవిధంగా పోలీస్‌శాఖ పనిచేసున్నన్నారు. కార్యక్రమంలో డీ ఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ సీతయ్య, ఎక్సైజ్ సీఐ నాగేందర్, ఎస్సై రాములు, పోలీసులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.