అయిజ, ఫిబ్రవరి 4 : పచ్చని తోరణాలు.. మంగళవాయిద్యాలు.. వేద పండితుల మంత్రోచ్ఛరణలు.. భ క్తుల గోవింద నామస్మరణల మధ్య శ్రీవారి కల్యాణం కమనీయంగా జరిగింది. మండలంలోని ఉత్తనూరు గ్రా మంలో కొలువైన ధన్వంతరి వేంకటేశ్వర స్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున వెంకన్న స్వామి శ్రీదేవి, భూదేవికి మాంగళ్యధారణ చే శారు. పులకుర్తి మనీశ్రెడ్డి, సుప్రజ దంపతులు స్వామికి తోడు కూర్చోగా.. టీటీడీ ఆలయ వేద పండితులు కల్యాణఘట్టాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. వేడుకను తిలకించిన భక్తులు తన్మయత్వం పొందారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుద్దీపాల కాంతులతో ముస్తాబు చేశారు. దేవస్థాన కమిటీ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసింది. అలాగే శ్రీవారికి గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీవారిని పురవీధుల మీదుగా దశిమి కట్ట వరకు ఊరేగించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. సుప్రభాత సేవతో ప్రారంభించి బిందెసేవ, పంచామృతం, బలిహరణం, పల్లకీసేవ జరిపారు. రాత్రి 11 గంటలకు ప్రభోత్సవంపై శ్రీదేవి, భూదేవి సమేత వెంకన్న ఆశీనులై విహరించారు.
నేడు రథోత్సవం ..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి రథోత్స వం జరగనున్నది. ఇందుకుగానూ ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తు లు భారీగా తరలిరానున్నారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు, నాయకులు పాల్గొన్నారు.