మక్తల్‌టౌన్, డిసెంబర్ 21: నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థుల ఉన్నత విద్య కోసమే మక్తల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన సందర్భంగా బుధవారం మక్తల్ జూనియర్ కళాశాల ఆవరణలో డిగ్రీ కళాశాలను ఇన్‌చార్జ్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మక్తల్ నూతన డిగ్రీ కళాశాలలో ఆర్స్అండ్ సైన్స్ కోర్సులతో త్వరలోనే అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 2022 -23 విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమవుతాయని, కళాశాలలో కావాల్సిన ఫ్యాకల్టీ ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరుల ఉన్నారు.
దైవ చింతనతోనే ముక్తి మార్గం
మక్తల్ టౌన్ డిసెంబర్ 21: దైవచింతనతోనే ముక్తికి మార్గం లభిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లా గురుమిట్కల్‌లో జేడీఎస్ యువనేత శరణగౌడ ఆధ్వర్యంలో చేపట్టిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం హాజరై స్వామివారి పడిపూజలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామిని కొలవడం వల్ల ముక్తి చేకూరుతుందని పేర్కొన్నా రు. పడిపూజ కార్యక్రమంలో మక్తల్, మాగనూర్, ఊట్కూ ర్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అయ్యప్పస్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.